Advertisement
Google Ads BL

లైగర్ కన్నా కార్తికేయ2 కే బెటర్ కలెక్షన్స్


గురువారం భారీ అంచనాల నడుమ విడుడుదలైన లైగర్ మూవీ కి మొదటి రోజు ఓపెనింగ్స్ అదిరిపోయినా.. లైగర్ కొచ్చిన ప్లాప్ టాక్ తో రెండో రోజే కలెక్షన్స్ పడిపోయాయి. రెండు వారాలుగా కలెక్షన్స్ పరంగా రోజు రోజుకి వార్తల్లో నిలుస్తున్న కార్తికేయ 2 కి లైగర్ రిలీజ్ రోజు బిగ్ షాక్ తగిలింది. కానీ ఇప్పుడు లైగర్ కి వచ్చిన టాక్ తో కార్తికేయ కలెక్షన్స్ మరోసారి పెరిగాయి. అది కూడా లైగర్ కన్నా బెటర్ కలెక్షన్స్ నిఖిల్ కార్తికేయ కొల్లగొట్టడం అందరిలో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. 15 వ రోజు కార్తికేయ కలెక్షన్స్ చాలా ఏరియాల్లో విజయ్ దేవరకొండ లైగర్ మూడు రోజుల కలెక్షన్స్ కన్నా బెటర్ గా కనిపించాయి. 

Advertisement
CJ Advs

ఆంధ్ర - తెలంగాణాలో కార్తికేయ 2..15 వ రోజు అంటే శనివారం 1.21 కోట్లు కలెక్ట్ చేస్తే.. లైగర్ కేవలం కోటి కొల్లగొట్టింది. అమెరికాలో కార్తికేయ $92k కలెక్ట్ చేస్తే లైగర్ $45k తో సరిపెట్టుకోవల్సి వచ్చింది. అలాగే ఆస్ట్రేలియాలోను లైగర్ $22k తో దారుణమైన కలెక్షన్స్ తెచ్చుకోగా.. కార్తికేయ 2 $53k కొల్లగొట్టింది. ఇక్కడ స్టార్ ఎవరన్నది కాదు, కంటెంట్ ఎలా ఉన్నది ముఖ్యమని కార్తికేయ, లైగర్ కలెక్షన్స్ నిరూపిస్తున్నాయి. మరి లైగర్ మొదటి వీకెండ్ కే మూటాముల్లే సర్దుకునేలా కనబడుతుంది. 

Karthikeya has better collection than Liger movie:

Karthikeya 2 and Liger Latest Australia and USA collections
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs