ప్రస్తుతం సోషల్ మీడియాలో బాలీవుడ్ పై వెల్లువెత్తుతున్న నిరసనలు చూస్తే అసలు బాలీవుడ్ మళ్ళీ పూర్వ వైభవాన్ని పొందుతుందా అనేలా ఉంది పరిస్థితి. సోషల్ మీడియాలోనే కాదు, నార్త్ ఆడియన్స్ కూడా బాలీవుడ్ మూవీస్ పై విముఖత చూపిస్తున్నారు. అన్నిటికన్నా మించి కరోనా అయితే.. దానిని మించిన నెపోటిజం బాలీవుడ్ లో పాతుకుపోవడం, సుశాంత్ సింగ్ రాజ్ ఫుట్ లాంటి నటుడు నెపోటిజానికి బలైపోవడంతో నెటిజెన్స్ ఇలా బాలీవుడ్ పై కక్ష సాధిస్తున్నారు. అందుకే బాలీవుడ్ లో స్టార్ కిడ్స్, బడా హీరోల సినిమాలు విడుదలవుతుంటే #BoyCottBollywood తో పాటుగా ఆయా సినిమాల హాష్ టాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి. అందులో ఇప్పుడు #BoyCottBrahmastra హాష్ టాగ్ ట్విట్టర్ లో ఊపందుకుంది.
అలియా భట్-రణబీర్ కపూర్-నాగార్జున-అమితాబ్ లాంటి నటులు నటించిన బ్రహ్మాస్త్ర మూవీ సెప్టెంబర్ 9 న విడుదలవ్వబోతుంది. ఈ సినిమాకి సంబందించిన ప్రమోషన్స్ కి అలియా భట్ బేబీ బంప్ తో హాజరవుతుంది. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని రామోజీ ఫిలిమ్ సిటీలో జరగబోతుంది. ఈ ఈవెంట్ కి గెస్ట్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ హాజరవుతున్నారు. దానితో ఎన్టీఆర్ ఫాన్స్ ఎగ్జైట్ అవుతూ #NTRForBrahmastra హాష్ టాగ్ ట్రెండ్ చేస్తుంటే.. బాలీవుడ్ పై నెగిటివిటి చూపించే వారు #BoyCottBrahmastra రచ్చ చేస్తున్నారు. దానితో ట్విట్టర్ లో #NTRForBrahmastra vs #BoyCottBrahmastra అన్న రేంజ్ లో వార్ మొదలైంది.