లైగర్ సినిమా రిలీజ్ కి ముందు విజయ్ దేవరకొండ ఎక్కడికి వెళ్తే అక్కడ రౌడీ ఫాన్స్, లైగర్ అభిమానులు చేసిన రచ్చ చూస్తే లైగర్ ఓపెనింగ్స్ పరంగా రికార్డులు సృష్టించడం ఖాయమనే అనుకున్నారు. విజయ్ దేవరకొండ కూడా లైగర్ పై అంతే నమ్మకం పెట్టుకున్నాడు. సినిమాపై విపరీతమైన బజ్ క్రియేట్ అయ్యింది. ఆడియన్స్ అనుకున్న అంచనాలు, విజయ్ పెట్టుకున్న నమ్మకాన్ని లైగర్ వమ్ము చేసింది. లైగర్ ఫస్ట్ డే ఫస్ట్ షో కే డివైడ్ టాక్ రావడంతో రౌడీ ఫాన్స్ ని బాగా డిస్పాయింట్ చేసింది. లైగర్ సినిమా ని సౌత్ ఆడియన్స్ పూర్తిగా తిప్పికొట్టారు.
ప్రముఖ ఇంటర్నేషనల్ మూవీ డేటా బేస్ సంస్థ ఐఎండీబీ ఇచ్చే రేటింగ్స్ తో ఆయా సినిమాలను వీక్షించేందుకు ఆడియన్స్ ఆసక్తి చూపుతుంటారు. మరి ఐఎండీబీ లైగర్ కి ఇచ్చిన రేటింగ్ చూసి రౌడీ ఫాన్స్ కి మూర్ఛ వచ్చింత పనై ఉండొచ్చు. 10కి కేవలం 1.7 రేటింగ్ మాత్రమే ఐఎండీబీ లైగర్ కి ఇచ్చింది. ఇది మరీ చెత్త రేటింగ్. అంటే ఈ మధ్యన బాలీవుడ్ లో రిలీజ్ అయిన లాల్ సింగ్ చద్దా, రక్షా బంధన్ చిత్రాల కంటే తక్కువ అన్నమాట. మరి లాల్ సింగ్ చద్దా కన్నా కాస్త బెటర్ పెరఫార్మెన్స్ ఇచ్చిన లైగర్ కి ఐఎండీబీ 1.7 రేటింగ్ ఇవ్వడం అందరికి షాకిస్తుంది.