Advertisement
Google Ads BL

వైరల్: పవన్ సినిమాలపై హరీష్ శంకర్ ట్వీట్


పవన్ కళ్యాణ్ ఎప్పుడు సెట్స్ మీదకి వెళతారో.. ఎప్పుడు రాజకీయాల్లో ఆక్టివ్ అవుతారో అనేది ఫాన్స్ కి అస్సలు అర్ధం కావడం లేదు. భీమ్లా నాయక్ బ్లాక్ బస్టర్ తర్వాత పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు సెట్స్ మీదకి వెళ్ళినా.. ఓ షెడ్యూల్ తర్వాత ఆ సినిమా షూటింగ్ ఆగిపోయింది. మళ్ళీ ఆ షూటింగ్ పై ఇంతవరకు అప్ డేట్ లేదు. మధ్యలో టాలీవుడ్ షూటింగ్స్ బంద్ కారణంగా సినిమాల షూటింగ్స్ ఆగిపోయాయి. ఇక హరి హర వీరమల్లు సంగతి ఇలా ఉంటే.. అటు హరీష్ శంకర్ భవదీయుడు భగత్ సింగ్, ఇటు సురేందర్ రెడ్డి మూవీ, మరోపక్క సముద్రఖని తమిళ రీమేక్ షూటింగ్స్ అప్ డేట్స్ కూడా తెలియకపోయేసరికి పవన్ ఫాన్స్ లో కంగారు మొదలయ్యింది.

Advertisement
CJ Advs

అటు పవన్ తో సినిమాలు చేసే మేకర్స్ కూడా ఆయన ఎప్పుడు సెట్స్ మీదకి వస్తారో అని వెయిట్ చెయ్యడం తప్ప.. ఆయన్ని పిలిచి షూటింగ్స్ చెయ్యలేరు. తాజాగా పవన్ కళ్యాణ్ ఫాన్స్ హరీష్ శంకర్ ని టాగ్ చేస్తూ ఓ ట్వీట్ చేసారు. పవన్ కళ్యాణ్ అన్నా ఆ స్టయిల్, స్వాగ్, స్టెప్స్ ఏమైపోయాయ్.. హరీష్ శంకర్ అన్నా మళ్లీ నీ వల్లే పవన్ అన్న స్టయిల్ తో పాటు అన్నీ బయటికి వస్తాయ్.. అది నీవల్లే అవుతుంది.. నీ సినిమాతోనే లాస్ట్ అనిపిస్తుంది మాకు అంటూ ఓ ఫ్యాన్ ట్వీట్ చెయ్యగా.. అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ ఫాన్స్ కి రిప్లై ఇచ్చే హరీష్ శంకర్ స్పందిస్తూ.. అన్నీ ఉంటాయ్.. ఏదీ మిస్ అవ్వదు.. మీ ఎదురుచూపులకు తగ్గ ప్రతిఫలం వస్తుంది నన్ను నమ్మండి.. అంటూ సూపర్ రిప్లై ఇవ్వడంతో పవన్ ఫాన్స్ సంతోషపడిపోతున్నారు.

Pawan Kalyan will fulfill the wishes of fans!.. Harish Shankar:

Pawan Kalyan will fulfill the needs of followers.. Harish tweet viral
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs