Advertisement
Google Ads BL

కార్తికేయ 2: మరో వారం కలిసొచ్చింది


కార్తికేయ2 విడుదలకు ఎన్ని కష్టాలు పడితేనే.. విడుదలయ్యాక సూపర్ హిట్ అవడంతో కార్తికేయ 2 టీం మొత్తం రిలాక్స్ అవడమే కాదు, సినిమాని ఇంకా ఇంకా ప్రమోట్ చేస్తూనే ఉన్నారు. కార్తికేయ 2 హిందీలో లక్షల కలెక్షన్స్ తో మొదలై.. ఇప్పుడు కోట్లు కొల్లగొడుతుంది. అయితే కార్తికేయ 2 విడుదలయ్యాక తర్వాత వారం వచ్చిన చిన్న చితక సినిమాలన్ని డిస్డస్టర్స్ అవ్వగా.. ఆ రెండో వారంలోను కార్తికేయ నిలకడగా కలెక్షన్స్ కొల్లగొట్టింది. నిన్న శుక్రవారం 100 కోట్ల క్లబ్బులోకి చేరినందుకు గాను గ్రాండ్ గా సెలెబ్రేషన్స్ కూడా చేసారు. 

Advertisement
CJ Advs

ఇక మూడో వారం విజయ్ దేవరకొండ లైగర్ రావడంతో గురువారం కార్తికేయ కలెక్షన్స్ పడిపోయాయి. కానీ లైగర్ టాక్ తేడా కొట్టడంతో నిఖిల్ మరో వారం సేఫ్ అయ్యాడు. నార్త్ లో కార్తికేయ 2 కి ఆదరణ బావుంది. అక్కడ ఇప్పటికే 10 కోట్లు కొల్లగొట్టిన ఈ సినిమాకి లైగర్ తో దెబ్బపడుతుంది అనుకున్నారు. కానీ లైగర్ సినిమాకి ప్లాప్ టాక్ పడడంతో.. మరోసారి నార్త్ లో కార్తికేయ 2 కి ఎదురు లేకుండా పోయింది. ఇక్కడ తెలుగు రాష్ట్రాలు, నార్త్ లోను మరో వారం కార్తికేయ కలెక్షన్స్ పరంగా దూసుకుపోతుంది. అలా విజయ్ దేవరకొండ లైగర్ టాక్ కార్తికేయకి కలిసొచ్చింది.

Karthikeya 2 is coming together next week:

Karthikeya 2 grows at box office
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs