తన మేనల్లుడు, ‘ఉప్పెన’ హీరో వైష్ణవ్ తేజ్‌పై మెగాస్టార్ చిరంజీవి సీరియస్ అయ్యారట. ఈ విషయం స్వయంగా ఆ వైష్ణవ్ బాబే చెప్పుకొచ్చాడు. అయితే అది ఇప్పుడు కాదు.. చిరంజీవి సినిమా ‘శంకర్ దాదా ఎమ్.బి.బి.ఎస్’ టైమ్‌లో. వైష్ణవ్ తేజ్ హీరోగా గిరీశయ్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రంగ రంగ వైభవంగా’. ఈ సినిమా కామ్‌గా సెప్టెంబర్ 2న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను భారీగా చేయడం లేదు కానీ.. చేస్తున్నాం అని అనిపించుకునేలా చేస్తున్నారు. అందులో భాగంగా బుల్లితెరపై అలీ హోస్ట్‌గా చేస్తున్న ‘అలీతో సరదాగా’ కార్యక్రమానికి హీరో వైష్ణవ్ తేజ్, దర్శకుడు గిరీషయ్య హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అలీ మ్యాగ్జిమమ్ వైష్ణవ్ దగ్గర నుండి పిండేశారు.
‘శంకర్ దాదా ఎమ్.బి.బి.ఎస్’ సినిమాలో కుర్చీలో కదలకుండా కూర్చున్న అబ్బాయివి నువ్వే కదా.. అని అలీ అడగగానే.. అవును అదే ఫస్ట్ కెమెరా ముందుకు రావడం అని సమాధానమిచ్చాడు. ఆ అవకాశం ఎలా వచ్చింది? చిరంజీవిగారితో చేయడం అప్పట్లో ఎలా అనిపించింది? అని అలీ అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ.. ఆ పాత్రకు నన్ను మామయ్యే రికమండ్ చేశారు. చెయ్‌రా బాగుంటుంది అని అన్నారు. సరేనని అన్నాను. కానీ కదలకుండా కూర్చోవడం నా వల్ల కాలేదు. మధ్యలో నవ్వేసేవాడిని. అలా నవ్వుతున్నప్పుడే మామయ్య సీరియస్ అయ్యారు. ఆయన సీరియస్ అవడంతో.. ఇక కామ్‌గా, కన్నార్పకుండా కూర్చున్నాను.. టేక్ ఓకే అయింది.. అని వైష్ణవ్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతోంది.