Advertisement
Google Ads BL

200 కోట్లు.. ఛార్మీకి ఏడుపొక్కటే తక్కువ!


రూ. 200 కోట్లు.. ‘లైగర్’ విడుదలకు ముందు ఆ సినిమాకి వచ్చిన ఓటీటీ ఆఫర్. ఈ విషయం స్వయంగా ఈ చిత్ర నిర్మాతలలో ఒకరైన ఛార్మీనే సినిమా విడుదలకు ముందు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఇప్పుడు విడుదల తర్వాత నిజంగా ఆమెకి ఏడుపొక్కటే తక్కువ అన్నట్లుగా రిజల్ట్ ఉంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఛార్మీ మాట్లాడుతూ.. ‘‘సినిమా ఇంకా పూర్తి కాలేదు. మా చేతిలో డబ్బులన్నీ అయిపోయాయి. ఒక్క రూపాయి కూడా లేదు. అప్పుడు ఓ ప్రముఖ ఓటీటీ నుండి భారీ ఆఫర్ వచ్చింది. అయినా కూడా సినిమాపై, విజయ్‌పై ఉన్న నమ్మకంతో.. ఆ ఆఫర్‌ని కాదనుకున్నాం. నిజంగా దీనికి ఘట్స్ కావాలి. పూరీగారిలో ఆ ఘట్స్ చూశాను..’’ అంటూ ఛార్మీ తన మేకప్ చెరిగిపోకుండా.. చాలా జాగ్రత్తగా కన్నీటి పర్యంతమైంది. ఇది చూసిన వారంతా ఛార్మీ సింపతీ కోసం ఏదో అలా ట్రై చేసిందని అనుకున్నారు.. కానీ సినిమా రిజల్ట్‌ ఆమెకి తెలుసు కాబట్టే.. చేతుల దగ్గరకి వచ్చిన ఆఫర్‌ని పోగొట్టుకున్నందుకే ఆమె అలా కన్నీరు పెట్టుకుని ఉంటుందని.. ఆ సీన్‌ని గుర్తు చేసుకుంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తుండటం గమనార్హం. 

Advertisement
CJ Advs

 

ఇక విజయ్ దేవరకొండ అయితే.. ఈ సినిమా మొదటి రోజే రూ. 200 కోట్లతో మొదలవుతుందని చెప్పడం కూడా కాస్త అతికి దారిచ్చింది. సినిమా విడుదల తర్వాత ఈ సినిమా మొదటి రోజు తిప్పి కొడితే.. రూ. 15 కోట్లు కూడా వసూలు చేయలేకపోయింది. ఇప్పుడు వచ్చిన టాక్‌తో ఈ సినిమా భారీ నష్టాలను చవిచూడటం ఖాయం అన్నట్లుగా అప్పుడే టాక్ కూడా స్ర్పెడ్ అవుతోంది. ఈ సినిమాకి ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 90 కోట్ల వరకు జరిగినట్లుగా తెలుస్తుంది. రిలీజ్ రోజు కాస్త హౌస్‌ఫుల్స్ పడ్డాయి కానీ.. వచ్చిన టాక్‌తో రెండో రోజే.. థియేటర్లు వెలవెల బోయే పరిస్థితి నెలకొంది. అందుకేనేమో.. ఛార్మీ ఏడుస్తున్న ఎమోజీలతో ట్వీట్ చేసింది. ఏదిఏమైనా.. మంచి ఆఫర్ వచ్చినప్పుడు సినిమా అమ్మేసి ఉంటే.. ఇప్పుడు ఇటువంటి పరిస్థితిని ఫేస్ చేయాల్సి వచ్చేది కాదు.. అందుకే ఇప్పుడామెకి ఏడుపొక్కటే తక్కువ.. తక్కువ ఏముందిలే.. ఏడుస్తూనే ఉండి ఉంటుంది.

Comments on Charmee with Liger Result:

200 crores Loss to Charmee and her team with Liger Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs