సోషల్ మీడియాలో తనేం చెప్పాలనుకున్నా దానిని నిర్భయంగా, నిర్మొహమాటంగా చెప్పేస్తుంది యాంకర్ అనసూయ. ఈ మధ్యన జబర్దస్త్ లో తన మీదే వేసే పంచ్ లు ఇబ్బందికరంగా ఉండడంతో జబర్దస్త్ నుండి తప్పుకున్నాను అంటూ సంచలనంగా మాట్లాడిన అనసూయ బాడీ షేమింగ్ విషయంలో సహించను అని ఖరాఖండిగా చెప్పింది. ఇక తనపై సోషల్ మీడియాలో కామెంట్స్ చేసే నెటిజెన్స్ ని, అలాగే ట్రోల్ చేసే వారిని అస్సలు వదలదు. వారికి తనదైన శైలిలో పంచ్ లు వేస్తూ గుణపాఠం నేర్పుతుంది. తాజాగా అనసూయ చేసిన ట్వీట్ ఒకటి సోషల్ మీడియాలో హైలెట్ అయ్యింది. అది కూడా అనసూయ ఓ హీరోని ఉద్దేశించి చేసిందే అంటూ కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.
ఇంతకీ అనసూయ వేసిన ట్వీట్ ఏమిటి అంటే.. అమ్మని అన్న ఉసురు ఊరికే పోదు, కర్మ కొన్నిసార్లు రావడం లేట్ అవ్వోచ్చేమో కానీ, రావడం మాత్రం పక్కా అంటూనే #NotHappyOnsomeonesSadness but #FaithRestored హాష్ టాగ్స్ ని ఈ ట్వీట్ కి అనసూయ జత చేసింది. అయితే గతంలో ఓ హీరో సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ సినిమాలోని ఓ డైలాగ్ ని నచ్చలేదు అని ఓపెన్ గా చెప్పిన అనసూయ.. ఈసారి ఈ ట్వీట్ విషయంలో కాస్త ఇండైరెక్ట్ ఆ హీరోకి తగిలేలా పంచ్ వేసింది అనే టాక్ మాత్రం వినిపిస్తుంది. మరి తగలాల్సిన వారికి అనసూయ ట్వీట్ పంచ్ గట్టిగానే తగిలిందేమో కదా..