Advertisement
Google Ads BL

అనుపమకి కరోనా


అనుపమ పరమేశ్వరన్ ఒక్కసారిగా సోషల్ మీడియాలో ఫెమస్ అయిన పేరు. కారణం కార్తికేయ 2. నిఖిల్ - చందు మొండేటి కలయికలో తెరకెక్కిన కార్తికేయ 2 బ్లాక్ బస్టర్ హిట్ అవడం, అది కూడా పాన్ ఇండియా లెవల్లో భారీ హిట్ అవడంతో అందులో హీరోయిన్ గా నటించిన అనుపమ పరమేశ్వరన్ పేరు మోగిపోతుంది. అయితే కార్తికేయ పోస్ట్ ప్రమోషన్స్, ప్రీ ప్రమోషన్స్ లో పాల్గొన్న అనుపమ పరమేశ్వరన్ కి కరోనా సోకినట్లుగా ట్వీట్ చేసింది. కార్తికేయ ప్రమోషన్స్ అంటూ రకరకాల ప్రాంతాల్లో తిరిగిన అనుపమకి జలుబు, దగ్గు వంటి లక్షణాలు కనిపించడంతో ఆమె కరోనా పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్‌ అని తేలినట్లు తెలుస్తోంది. 

Advertisement
CJ Advs

దానితో అనుపమ ప్రస్తుతం ఇంట్లోనే ఐసోలేషన్‌లోకి వెళ్ళినట్లుగా తెలుస్తుంది. కరోనా కారణంగా భయం లేకపోయినా.. మరోసారి కరోనా తన ప్రభావం చూపిస్తుంది. అటు పొలిటికల్ లీడర్స్, ఇటు సినిమా వాళ్ళు ఈమధ్యన కరోనా బారిన పడుతున్నారు. కాకపోతే కరోనా వలన ప్రాణ భయం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నా.. కరోనా కారణంగా సఫర్ అవుతున్నారు. ఇక అనుపమ కరోనా నుండి త్వరగా కోలుకోవాలని ఆమె ఫాన్స్ దేవుడిని ప్రార్థిస్తున్నారు.

Anupama Parameswaran Tested Covid Positive:

Anupama Parameswaran Tested Covid 19
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs