Advertisement
Google Ads BL

కౌశల్ వల్ల డిప్రెషన్ లోకి వెళ్ళాను: తేజస్వి


సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా ద్వారా ప్రేక్షకులకి దగ్గరైన తేజస్వి మడివాడ తర్వాత చేసిన సినిమాల ద్వారా పెద్దగా పాపులర్ కాలేకపోయింది. హీరోయిన్ కి ఫ్రెండ్ కేరెక్టర్స్ అంటూ సర్దుకుపోయింది. కానీ తెలుగులో ఫెమస్ అయిన బిగ్ బాస్ సీజన్ 2 లో కంటెస్టెంట్ గా వెళ్లి క్రేజ్ తెచ్చుకుందామనుకుంది. అక్కడ తనీష్, సామ్రాట్ బ్యాచ్ తో ఫ్రెండ్ షిప్ చేసి అగ్రెసివ్ గా కౌశల్ తో గొడవలు పడింది. కౌశల్ పై మాట్లాడితే గొడవ పెట్టుకోవడంతో కౌశల్ ఫాన్స్, కౌశల్ ఆర్మీ ఆమెపై పగ పెంచుకున్నారు. ఇక అనూహ్యంగా మధ్యలోనే ఎలిమినేట్ అయ్యి హౌస్ ని వీడిన తేజస్వి తర్వాత చాలా రోజులపాటు ఎవరి ముందుకు, మీడియా ముందుకి రాలేదు. రీసెంట్ గా కమిట్మెంట్ సినిమా ప్రమోషన్స్ తోనూ, అలాగే బిగ్ బాస్ ఓటిటి సీజన్ లో కనబడిన తేజస్వి బిగ్ బాస్ సీజన్ 2 తర్వాత తనకి ఎదురైన అనుభవాలను ఓ యూట్యూబ్ ఛానల్ లో బయటపెట్టింది. 

Advertisement
CJ Advs

బిగ్ బాస్ సీజన్ 2 నుండి ఎలిమినేట్ అయ్యి బయటికి వచ్చాక తాను కాస్త హ్యాపీగా ఉన్నాను అని, అందరిని కలుసుకుని రిలాక్స్ అవుదామనుకున్న టైం లో కౌశల్ ఆర్మీ తనని చాలా ఇబ్బంది పెట్టడంతో డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను అని, నాపై వచ్చిన మీమ్స్, నెగెటివ్ కామెంట్స్ అన్ని నన్ను చాలా ఇబ్బంది పెట్టాయి. ఆ తర్వాత ఎవరికీ కనబడకుండానే ఉన్నాను, ఇండియాలోనే లేకుండా అటు యిటు తిరిగాను అని, నేను కౌశల్ ని ఏమి చెయ్యలేదు, కానీ కౌశల్ ఆర్మీ నన్ను టార్గెట్ చేసింది.. ఇప్పుడు కౌశల్ ఏమి హీరో అవ్వలేదు, ఎక్కడా కనబడడం లేదు, నేనేమి జీరో అవ్వలేదు అంటూ తేజస్వి మడివాడ కౌశల్ పై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

I went into depression because of Kaushal: Tejaswi Madivada:

I was depressed with the trolls : BB 2 Tejaswi 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs