Advertisement
Google Ads BL

RC15 పై ఫుల్ క్లారిటీ ఇచ్చిన శంకర్


ఈరోజు బుధవారం ఉదయమే కమల్ హాసన్ తో చెయ్యాల్సిన భారతీయుడు 2 మూవీ షూటింగ్ మళ్ళీ మొదలు పెట్టినట్లుగా కమల్ హాసన్ ఇండియన్ 2 పోస్టర్ తో పాటుగా.. అలాగే శంకర్ ఇంకా భారతీయుడు 2 టీం కలిసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న ఫొటోస్ సోషల్ మీడియాలో చూడగానే మెగా ఫాన్స్ గుండెల్లో గుబులు మొదలైంది. ఎందుకంటే భారతీయుడు 2 మూవీ సెట్స్ లోకి వెళ్లిన శంకర్.. రామ్ చరణ్ తో చెయ్యాల్సిన RC15 ని పక్కనబెట్టేస్తారేమో అని, మధ్యలో శంకర్ భారతీయుడు 2, RC15 షూటింగ్స్ ని పారలల్ గా చేస్తారని అంటున్నా.. మెగా ఫాన్స్ లో ఈ రోజు మొదలైన ఆందోళన అంతా ఇంతా కాదు. 

Advertisement
CJ Advs

కానీ మెగా ఫాన్స్ ఆందోళనకి, మిగతా వారి అనుమాలను పటా పంచలు చేస్తూ దర్శకుడు శంకర్ ఫుల్ క్లారిటీ ఇచ్చారు. సోషల్ మీడియాలో శంకర్ ట్వీట్ చేస్తూ.. అందరికి హాయ్, ఇండియన్ 2 మరియు RC15 చిత్రాలు ఒకేసారి చిత్రీకరించబడతాయి. ఇంకా RC 15 తదుపరి షెడ్యూల్ సెప్టెంబర్ మొదటి వారం నుండి వైజాగ్, హైదరాబాద్ లలో చిత్రీకరణకు సిద్ధంగా ఉంది అంటూ.. రామ్ చరణ్ ని, దిల్ రాజు ని టాగ్ చేస్తూ శంకర్ చేసిన ట్వీట్ తో మెగా ఫాన్స్ మళ్ళీ తేరుకున్నారు. ఎక్కడ ఆగిపోతుందో.. ఇప్పట్లో మళ్ళీ పట్టాలెక్కదు అనుకున్న ఫాన్స్ కి శంకర్ ఈ విధంగా RC15 పై అప్ డేట్ ఇవ్వడంతో వారు కూల్ అయ్యారు.

Shankar gave full clarity on RC15 shoot:

Shankar gave full clarity on RC15 and Indian 2 shoot
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs