Advertisement
Google Ads BL

సుడిగాలి సుధీర్ కి సినిమా కష్టాలు


సుడిగాలి సుధీర్ ఈటీవీలో ఉండగా.. చాలా ఫెమస్ అయ్యి సినిమాల్లో హీరోగా మారాడు. జబర్దస్త్, ఢీ డాన్స్ షో, శ్రీదేవి డ్రామా కంపెనీ, మధ్యమధ్యలో ఫెస్టివల్ ఈవెంట్స్, రష్మీ తో లవ్ ట్రాక్ తో బాగా పాపులర్ అయిన సుధీర్.. ఈమధ్యన జబర్దస్థ్మ్, ఢీ షో, శ్రీదేవి డ్రామా కంపెనీ ని వదిలేసి బయటికి వచ్చేసాడు. తర్వాత స్టార్ మా, జీ ఛానల్స్ లో కనిపిస్తున్న సుధీర్ సర్ ప్రైజింగ్ గా ఈటీవీలో ఓ స్పెషల్ షో లో మెరిశాడు. ఏదైనా సుధీర్ ఈటివి నుండి రావడం ఆయన ఫాన్స్ కి అస్సలు ఇష్టం లేదు. అయితే ఇప్పుడు సుధీర్ కి హీరోగా కూడా సినిమా కష్టాలు మొదలయ్యాయి. గతంలో చేసిన సినిమాలేవీ అంటే సాఫ్ట్ వెర్ సుధీర్, 3 మంకీస్ లాంటి సినిమాలు డిసాస్టర్ అవ్వగా.. తాజాగా వాంటెడ్ పండుగాడు కూడా డిసాస్టర్ లిస్ట్ లోకి వెళ్ళిపోయింది. గత వారం విడుదలైన ఈ సినిమా కి ప్రేక్షకులు లేక షోస్ ని రద్దు చెయ్యాల్సిన పరిస్థితి.

Advertisement
CJ Advs

వాంటెడ్ పండుగాడు సుధీర్ కి బాగా షాకిచ్చింది. అయితే ఇప్పుడు వాంటెడ్ పండుగాడు డిసాస్టర్ ఎఫెక్ట్ సుధీర్ తదుపరి సినిమా గాలోడు మీద పడింది అంటున్నారు. మాస్ యాక్షన్ ఎలిమెంట్స్ తో తెరకెక్కుతున్న గాలోడు మూవీలో సుధీర్ డాన్స్ లు స్పెషల్ గా ఉండబోతున్నాయి అని, సుధీర్ పెరఫార్మెన్స్ స్పెషల్ గా ఉండబోతుంది అనే టాక్ ఉంది. కానీ వాంటెడ్ పండుగాడు సినిమాకి పెట్టిన పెట్టుబడి కూడా వెనక్కి రాకపోవడంతో ఇప్పుడు గాలోడు నిర్మాతలు ఆలోచనలో పడడమే కాదు, గాలోడు షూటింగ్ ని మధ్యలో ఆపేసినట్లుగా తెలుస్తుంది. అలాగే మరో రెండు సినిమాలు చర్చల దశలో ఉండగా.. అవి కూడా పట్టాలెక్కేవరకు అనుమానమే అంటున్నారు.

Shooting of Sudheer Gaalodu movie stopped:

Sudheer Gaalodu movie update
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs