Advertisement
Google Ads BL

లైగర్ ఫస్ట్ రివ్యూ


మరికొన్ని గంటల్లో వరల్డ్ వైడ్ ఆడియన్స్ ముందు రాబోతున్న పాన్ ఇండియా ఫిలిం లైగర్ మూవీ పై ట్రేడ్ లోనే కాదు, ఆడియన్స్ లోను అంచనాలున్నాయి. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా రాబోతున్న లైగర్ మూవీ ప్రమోషన్స్ చూస్తుంటే సినిమా సూపర్ హిట్ అవడం ఖాయమని అనిపిస్తుంది. పూరి మార్క్ డైలాగ్స్, విజయ్ దేవరకొండ యాటిట్యూడ్ సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తాయని ఆడియన్స్ నమ్ముతున్నారు. అయితే రేపు ఆగష్టు 25 న విడుదల కాబోతున్న లైగర్ మూవీ ఫస్ట్ రివ్యూ అంటూ ఓవర్సీస్ సెన్సార్ బోర్డ్ సభ్యుడు ఉమైర్ సంధు తనదైన శైలిలో లైగర్ సినిమాపై తన అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో ఉంచాడు. అది కాస్తా వైరల్ గా మారింది. దుబాయ్ నుండి టాలీవుడ్ సినిమాలకు రివ్యూలు ఇచ్చే ఉమైర్.. లైగర్ పై ఇచ్చిన రివ్యూ చూస్తే సినిమా బ్లాక్ బస్టర్ అవడం ఖాయం.

Advertisement
CJ Advs

ఇక ఉమైర్ లైగర్ రివ్యూలోకి వెళితే విజయ్ దేవరకొండ సినిమా మొత్తాన్ని తన భుజాలపై మోశాడు అని, సింగిల్ లైన్ లో చెప్పాలంటే విజయ్ దేవరకొండ వన్ మేన్ షో చేశాడు.. అని, టెర్రిఫిక్ యాక్షన్ స్టంట్స్ తో పాటుగా పూరి జగన్నాధ్ డైరెక్షన్ అదిరిపోయింది. అంతేకాకుండా రమ్యకృష్ణది ఒక సర్ ప్రైజ్ ప్యాకేజ్. కాకపోతే లైగర్ స్టోరీ, స్క్రీన్ ప్లే మాత్రం యావరేజ్ గా ఉన్నాయి.. అంటూ ఉమైర్ సంధు చేసిన ట్వీట్ తో రౌడీ ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు. మా హీరో పాన్ ఇండియా లెవల్లో హిట్ కొట్టేసాడంటూ సందడి చేస్తున్నారు.

Liger First review:

Liger Review - Umair Sandhu
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs