Advertisement
Google Ads BL

ప్రభాస్ వెయిట్ లాస్ వెనుక రహస్యం


బాహుబలి తర్వాత ప్రభాస్ వెయిట్ పెరిగి బాగా ఇబ్బంది పడ్డారు. సాహో టైం లోను, రాధే శ్యామ్ టైం లోను ప్రభాస్ బరువు ఆయన లుక్స్ ని డ్యామేజ్ చేసింది. ప్రభాస్ ఫాన్స్ కూడా ఆయన లుక్స్ విషయంలోనూ, వెయిట్ విషయంలోనూ చాలా డిస్పాయింట్ అయ్యారు. అయితే రాధే శ్యామ్ తర్వాత ప్రభాస్ కొన్నాళ్ళు ఎవరికీ కనిపించకుండా బరువు తగ్గిన విషయం ఓం రౌత్ పార్టీ లో రివీల్ అయ్యింది. ఇక సలార్, ప్రాజెక్ట్ కే షూటింగ్స్ లో పాల్గొంటున్న ప్రభాస్ మోకాలి నొప్పితో బాధపడుతున్నారు. దాని కోసమే ఓ ఆపరేషన్ కోసం ప్రభాస్ విదేశాలకు వెళ్ళినట్లుగా తెలుస్తుంది. 

Advertisement
CJ Advs

అయితే ప్రభాస్ అంత త్వరగా సన్నబడి స్లిమ్ గా మారడానికి కారణం ఆక్వా థెర‌పీ అంటున్నారు. సీత రామం ఈవెంట్ లోనే ప్రభాస్ చాలా స్టయిల్ గా  బరువు తగ్గి కొత్త లుక్ లో కనిపించడంతో ప్రభాస్ ఫాన్స్ కూడా చాలా హ్యాపీ గా ఫీలయ్యారు. అయితే ఎంతగా వర్కౌట్స్ చేసినా, బరువు తగ్గేందుకు కష్టపడినా బరువు తగ్గకపోయేసరికి ఆక్వా థెర‌పీ ద్వారా చాలా స‌హ‌జ‌మైన ప‌ద్ధతిలో ప్ర‌భాస్ బరువు తగ్గదని తెలుస్తుంది. ఈ ప‌ద్ద‌తిలో బ‌రువు చాలా త్వ‌ర‌గా త‌గ్గుతారు. అందుకే ప్రభాస్ దీనిని ఫాలో అవడంతో అంత త్వరగా బరువు తగ్గారని అంటున్నారు. మొత్తానికి ప్రభాస్ వెయిట్ లాస్ వెనుక రహస్యం ఇదన్నమాట అంటూ ప్రభాస్ ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు.

The secret behind Prabhas weight loss:

Prabhas new look
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs