Advertisement
Google Ads BL

పెళ్లి వద్దట.. బాయ్ ఫ్రెండ్ కావాలట


కేరెక్టర్ ఆర్టిస్ట్ ల్లో ఈ మధ్యన బాగా హైలెట్ అయ్యి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న పేరు సురేఖ వాణి. సినిమాల్లో పద్దతిగా పట్టు చీర కట్టి ట్రెడిషనల్ పాత్రలు చేసే ఆమె సోషల్ మీడియాలో కూతురు సుప్రీత తో పోటీగా చిట్టి పొట్టి డ్రెస్సులు వెయ్యడమే కాదు, కూతురు తో కలిసి డాన్స్ స్టెప్స్ ఇరగదీస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఆమె భర్త అనారోగ్యంతో కన్ను ముయ్యడంతో.. సురేఖ వాణీ రెండో పెళ్లి చేసుకోబోతుంది అనే ప్రచారమూ జరుగుతుంది. అలాగే కూతురు సుప్రీత కూడా తల్లికి మళ్ళీ పెళ్లి చేసే ఆలోచనలోనే ఉంది. తాజాగా సురేఖ వాణి ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పెళ్లి పై ఆసక్తి లేదు కానీ బాయ్ ఫ్రెండ్ కావాలనిపిస్తుంది అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.

Advertisement
CJ Advs

నాకు రెండో పెళ్లి పై పెద్దగా ఆసక్తి లేదు, కానీ నా కూతురు సుప్రీత మాత్రం నన్ను మళ్ళీ చేసుకోమని చెబుతుంది. ప్రస్తుతం అయితే పెళ్లి ఆలోచనలు లేదు.. ఫ్యూచర్ లో ఎమన్నా ఉంటుందేమో చూడాలి అని చెప్పిన సురేఖ వాణి తనకి ఓ బాయ్ ఫ్రెండ్ కావాలనిపిస్తుంది అంటూ సంచలనంగా మాట్లాడింది. తనకి ఇంకా నచ్చిన వ్యక్తి దొరకలేదని, ఒకవేళ దొరికినా.. అతను తనని బాగా అర్ధం చేసుకునే వాడైతే బావుంటుంది అని, అలాగే బాగా డబ్బు ఉన్నవాడు కావాలని, మంచి హైట్‌, పర్సనాలిటి ఉన్న వ్యక్తి నాకు బాయ్‌ఫ్రెండ్‌గా కావాలి, లైట్‌గా గడ్డం ఉండాలి.. అలాంటి వాడు దొరికే ఇష్టమైతే పెళ్లి ఆలోచనలు చేస్తాను అంటూ సురేఖ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Surekha Vani Says She Wants a Boyfriend:

Surekha vani Says She Wants a Boyfriend With This Kind of Qualities
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs