Advertisement
Google Ads BL

లైగర్ ప్లాప్ అయితే.. విజయ్ సమాధానమిదే


విజయ్ దేవరకొండ నటించిన ఫస్ట్ పాన్ ఇండియా మూవీ లైగర్ రాకకై రంగం సిద్ధమైంది. ఆగష్టు 25 న ఇండియా వైడ్ గా రిలీజ్ కాబోతున్న లైగర్ ప్రమోషన్స్ ఊపు మాములుగా లేదు. పూరి జగన్నాధ్, హీరోయిన్ అనన్య పాండే, విజయ్ దేవరకొండ, ఛార్మి ఇలా లైగర్ ప్రమోషన్స్ ని పిచ్చెక్కిస్తున్నారు. యూత్ లో లైగర్ పై విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ సినిమాతో విజయ్ దేవరకొండ పాన్ ఇండియా స్టార్ గా క్రేజీ హీరోగా మారడం ఖాయమంటున్నారు. రౌడీ హీరోస్ మాత్రమే కాదు.. సాధారణ ప్రేక్షకుడు కూడా లైగర్ సినిమా థియేటర్స్ లో చూడాలని ఇంట్రెస్ట్ తో కనిపిస్తున్నారు. అయితే తాజాగా విజయ్ దేవరకొండ ని లైగర్ ప్లాప్ అయితే ఏం చేస్తారు అంటూ ఒకరు అడిగారు.

Advertisement
CJ Advs

దానికి విజయ్ దేవరకొండ ఇదే ప్రశ్న నేను కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు అడిగితే.. చాలా కోపం వచ్చేది. అదే యాటిట్యూడ్ తో సమాధానం చెప్పేవాడిని. ఎందుకంటే నాకు కోపం చాలా ఎక్కువ. కొద్ది రోజులుగా ఫాన్స్, సినీ అభిమానులు నాపై చూపించిన అభినం నాలోని కోపాన్ని తగ్గించింది. నాలో చాలా మార్పు తీసుకువచ్చింది. తనకి ఫాన్స్, ప్రేక్షకులు ముఖ్యమని వాళ్ల కోసమే సినిమాలు చేస్తున్నానని చెప్పిన విజయ్ దేవరకొండ చాలా రోజులుగా చేస్తున్న లైగర్ ప్రమోషన్స్ కార్యక్రమాల వల్ల ఎన్నో ప్రాంతాలు తిరిగి ప్రేక్షకుల ప్రేమను గెలుచుకున్నా అంటూ చెప్పడం చూస్తే లైగర్ పోయినా.. పెద్ద ప్రాబ్లెమ్ ఉండదు అన్నట్టుగా ఉంది ఆయన ఆన్సర్ అంటున్నారు నెటిజెన్స్.

What if Liger flops? Vijay Deverakonda says If I react angrily:

What if Liger flops – Vijay Devarakonda answers
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs