టాలీవుడ్‌లో ఆగస్ట్ నెల బాక్సాఫీస్ పరిస్థితి బాగానే ఉంది. వరుసగా సినిమాలు హిట్లు పడ్డాయి. థియేటర్లు కళకళలాడుతున్నాయి. అయితే షూటింగ్‌లు మాత్రం మూలకు పడ్డాయి. కరోనా తో కొన్నాళ్ళు షూటింగ్స్ అన్ని ఎక్కడివక్కడే ఆగిపోయాయి. అప్పుడు టాలీవుడ్ అంతా బోసిపోయింది. మళ్ళీ సినిమాల రిలీజ్ లు, అలాగే షూటింగ్స్ తో ఇండస్ట్రీ కళకళలాడుతుంది.. కానీ సినిమా ఇండస్ట్రీలో సమస్యలు పెరిగిపోవడంతో నిర్మాతల మండలి.. టాలీవుడ్ లో షూటింగ్స్ అన్ని ఆపేసి సమస్యల పరిష్కారానికి దారులు వెతకడం స్టార్ట్ చేసింది. కానీ సమస్యల పరిష్కారం అటుంచి.. రోజుల తరబడి షూటింగ్స్ నిలిచిపోవడంతో స్టార్ హీరోల కి కోపం రావడమే కాదు, నిర్మాతలపై ఒత్తిడి మొదలయ్యింది.
బాలకృష్ణ లాంటివాళ్లు ఈ షూటింగ్స్ బంద్ లను తాను పట్టించుకోను అన్నట్లుగా తెలుస్తుంది. ఇంకా కొంతమంది పెద్ద హీరోలు కూడా ఈ షూటింగ్ ఆగిపోవడంతో ఆగ్రహంగా ఉండడంతో.. దిల్ రాజు, ప్రొడ్యూసర్ కౌన్సిల్ చర్చించి టాలీవుడ్ లో షూటింగ్స్ తిరిగిమొదలు పెట్టాలనే నిర్ణయానికి వచ్చారు. ఆగష్టు 25 నుండి విదేశాల్లో జరగాల్సిన షూటింగ్స్ మొదలు అవుతాయని, సెప్టెంబర్ 1 నుండి రెగ్యులర్ షూటింగ్‌లన్నీ మొదలు పెట్టుకోవచ్చు అంటూ ప్రకటించడంతో.. ఇప్పుడు పెద్ద, చిన్న చిత్రాల బృందాలు షూటింగ్స్ చేసుకోవడానికి సమాయత్తమవుతున్నాయి. ఇక నిన్న మొదలైన పుష్ప 2 రెగ్యులర్ షూట్, మహేష్ బాబు త్రివిక్రమ్ SSMB28 చిత్రాల షూటింగ్స్ కూడా త్వరలోనే మొదలు కాబోతున్నాయి.అని తెలుస్తుంది.