Advertisement
Google Ads BL

NTR 30కి దర్శకుడు మారుతున్నాడా?


యంగ్ టైగర్ ఎన్టీఆర్ 30వ చిత్రంపై ఇంకా కన్ఫ్యూజన్ కొనసాగుతూనే ఉంది. ‘ఆచార్య’ షాక్‌తో తన అమ్ముల పొదిలో ఉన్న కథలకి సరికొత్తగా సాన పట్టేందుకు కొరటాల ప్రయత్నాలు చేస్తుండటంతో.. ఈ చిత్రం ఎప్పుడు సెట్స్‌పైకి వెళుతుందనేది క్లారిటీ లేకుండా పోయింది. అయితే ఇప్పుడు కొత్తగా టాలీవుడ్ సర్కిల్స్‌లో మరో గాసిప్ వినబడుతోంది. ఎన్టీఆర్ 30వ చిత్రానికి దర్శకుడు మారబోతున్నాడనేలా వార్తలు వైరల్ అవుతున్నాయి. అందుక్కారణాలు కూడా చాలా గట్టిగానే వినబడుతున్నాయి. ఎన్టీఆర్ 30 చిత్రం కొరటాలతో కాకుండా ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబుతో చేస్తే ఎలా ఉంటుందా? అని యంగ్‌ టైగర్‌ ఆలోచనలో పడినట్లుగా టాక్ నడుస్తుంది.

Advertisement
CJ Advs

 

దీనికి కారణంగా రెండు రకాలుగా వార్తలు వినవస్తున్నాయి. అందులో ఒకటి రాజమౌళి సెంటిమెంట్. ఆల్రెడీ చరణ్ రూపంలో రాజమౌళి సెంటిమెంట్‌ని చవిచూసిన కొరటాల.. మళ్లీ ‘ఎన్టీఆర్’ రూపంలో కూడా దానిని భరించడానికి సిద్ధంగా లేడట. రాజమౌళితో బ్లాక్‌బస్టర్ కొట్టిన హీరోలకు తదుపరి దర్శకుడితో చేసే సినిమా ఫ్లాప్ అవడం అనేది సెంటిమెంట్‌గా వస్తుంది. ‘ఆచార్య’ రూపంలో కూడా అది వర్కయింది. ఇప్పుడు ఎన్టీఆర్‌తో కొరటాల చేసే చిత్రానికి కూడా అది వర్కయితే.. కొరటాల పేరు మరింతగా పడిపోతుంది. అందుకే.. కొరటాల ఈ ప్రాజెక్ట్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నట్లుగా టాక్. 

 

మరో రీజన్.. బుచ్చిబాబుతో యంగ్ టైగర్ సినిమా చేస్తే.. అది ఎటువంటి రిజల్ట్ వచ్చినా.. ఇద్దరికీ పెద్దగా పోయేది ఏమీ ఉండదు. హిట్టొస్తే.. చిన్న దర్శకుడితో కూడా హిట్ కొట్టాడని చెప్పుకుంటారు. ఒకవేళ హిట్టు కాకుండా రిజల్ట్ తేడా కొట్టినా.. అదే ఫార్ములాని అప్లయ్ చేస్తారు. అందుకే.. బుచ్చిబాబుపై ప్రెజర్ ఎక్కువ పడుతుందని, అది తట్టుకోలేకే తన గురువు సుకుమార్ సహాయం కోరాడనేలా ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం బుచ్చి స్ర్కిప్ట్ ఫైనల్ దశలో ఉన్నట్లుగా సమాచారం. కాబట్టి.. ఈ సెంటిమెంట్స్ అన్నీ పట్టించుకుంటే.. ఎన్టీఆర్ 30కి కొరటాల దర్శకత్వం చేయడమనేది దాదాపు అసాధ్యమే. అందుకే బుచ్చిని పావుగా కదుపుతున్నారనేది ఇండస్ట్రీ వర్గాల్లో ఇన్నర్‌గా నడుస్తున్న టాక్.

Is the director changing for Young Tiger NTR 30 Film?:

NTR30: Koratala Out and Buchibabu in
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs