Advertisement
Google Ads BL

నిఖిల్‌కి నిద్ర కూడా పట్టి ఉండదు!


యంగ్ హీరో నిఖిల్ నటించిన ‘కార్తికేయ 2’ చిత్రం ప్రప్రంచవ్యాప్తంగా ట్రెమండస్ రెస్పాన్స్‌ను రాబట్టుకుంటూ.. అద్భుతమైన కలెక్షన్లతో దూసుకుపోతుంది. ఈ సినిమా రిలీజ్ రోజు కలెక్షన్లు బాగా వీక్‌గా ఉన్నప్పటికీ.. మరుసటి రోజు నుండి.. రోజురోజుకీ మరింత స్ట్రాంగ్‌గా మారుతూ.. ఇప్పుడు సునామీగా మారింది. సినిమా టేకింగ్, హీరో నటన, కథ, స్ర్కీన్‌ప్లే.. ఇలా ప్రతి ఒక్కటీ ఈ చిత్రానికి ప్లస్ అయ్యాయి. ఫలితంగా పెద్ద హిట్‌కి కారణమయ్యాయి. తాజాగా ఈ సినిమా గురించి పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. తన పొలిటికల్ మీట్‌లో ప్రస్తావించడంతో.. ఈ సినిమా, నిఖిల్ మరోసారి వార్తలలో హైలెట్ అవుతున్నారు. ఆయన నోటి నుండి వచ్చిన ‘కార్తికేయ 2’ సినిమా పేరుతో మరోసారి ఈ సినిమా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. 

Advertisement
CJ Advs

 

మరీ ముఖ్యంగా.. పవన్ కల్యాణ్‌ని ఆరాధించే అభిమాని నిఖిల్ అయితే.. ఇంకా భ్రమలోనే ఉన్నానా? అనే ఫీలింగ్‌లో ఉండి ఉంటాడు. ‘‘పవర్ స్టార్‌కి నమస్తే.. ఆయన మాటల్లో సినిమా గురించి, నా గురించి వినడం.. చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్యూ ఫర్ యువర్ వర్డ్స్ సర్..’’ అని నిఖిల్ ట్వీట్ చేశారు. నిఖిల్ ఇలా రియాక్ట్ అవడానికి కారణం ఏంటో తెలుసా? పవన్ కల్యాణ్ తన పొలిటికల్ మీట్‌లో మాట్లాడుతూ.. ‘‘కార్తికేయ 2 అనే సినిమా వచ్చి దేశమంతా దుమ్ము దులిపేస్తుంది. నిఖిల్ అనే హీరో సినిమా. నేను మార్పు రావాలని కోరుకుంటున్నాను. ఇదే మార్పంటే. అందరి సినిమాలు ఆడాలి. మా సినిమాలే ఆడాలని ఎప్పుడూ అనుకోను. అందరి సినిమాలు విజయం సాధించాలి..’’ అని మార్పు గురించి మాట్లాడుతూ సినిమా ప్రస్తావన తెచ్చారు. దీంతో నిఖిల్ ఉప్పొంగిపోయాడు. ఫ్యాన్స్ అయితే.. పవర్ స్టార్ వర్డ్స్ విన్నాక, నిఖిల్ అసలు రాత్రి నిద్ర కూడా పోయి ఉండడు.. అంటూ కామెంట్స్ చేస్తుండటం విశేషం.

Pawan Kalyan delights Karthikeya 2:

Nikhil Happy with Pawan Kalyan words on Karthikeya 2
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs