Advertisement
Google Ads BL

‘భోళాశంకర్’ అప్‌డేట్ కూడా వచ్చేసింది


మెగాస్టార్ చిరంజీవి బర్త్‌డేను పురస్కరించుకుని ఇప్పటికే ఆయన నటిస్తోన్న ‘గాడ్‌ఫాదర్’ చిత్రానికి సంబంధించి టీజర్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఈ టీజర్ ప్రస్తుతం యూట్యూబ్‌ని షేక్ చేస్తూ దూసుకుపోతుంది. ఈ సినిమాతో పాటు ఆయన చేస్తున్న మరో చిత్రం ‘భోళాశంకర్’ నుంచి కూడా అప్‌డేట్‌ని ఆ చిత్ర మేకర్స్ వదిలారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో క్రియేటివ్ కమర్షియల్స్‌, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న మెగా మాసివ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘భోళాశంకర్’. రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని 14 ఏప్రిల్, 2023న భారీగా విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్‌ని విడుదల చేశారు.

Advertisement
CJ Advs

 

ఈ పోస్టర్‌లో చిరంజీవి స్టైలిష్‌గా నడుస్తూ ట్రైడెంట్ కీచైన్‌‌ని తిప్పుతూ మెగా ట్రీట్ ఇచ్చేశారు. మెగాస్టార్ వింటేజ్ స్వాగ్, మెహర్ రమేష్ స్టైల్‌.. రాబోయే వేసవి అభిమానులకు పండగలా ఉండబోతుందనేలా ఈ పోస్టర్‌లోని చిరు లుక్ ఉంది. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటి వరకు 40 శాతం షూటింగ్ పూర్తయినట్లుగా మేకర్స్ ప్రకటించారు. చిరంజీవి సరసన తమన్నా నటిస్తున్న ఈ చిత్రంలో మహానటి కీర్తి సురేష్, చిరంజీవికి చెల్లెలిగా నటిస్తోంది. మహతి స్వరసాగర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇక చిరు బర్త్‌డే స్పెషల్‌గా ఆయన నటిస్తున్న మరో చిత్ర అప్‌డేట్ ఎలా ఉండబోతుందో చూడాలి. అది బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం. ‘వాల్తేరు వీరయ్య’ అని టైటిల్ వినబడుతోంది. మెగాభిమానులకు బాబీ ఏ తరహా ట్రీట్ ఇవ్వబోతున్నారనేది.. ఇప్పటి వరకు అయితే ఇంకా ఎటువంటి క్లారిటీ రాలేదు. బహుశా సర్‌ప్రైజ్ ఏమైనా ప్లాన్ చేశారేమో..

Bholaa Shankar Arriving Date Out :

Mega Star Chiranjeevi&nbsp;<span>Bholaa Shankar Release Date Out</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs