Advertisement
Google Ads BL

70 ఏళ్ల వ్యక్తి లవ్ లెటర్ రాశాడు: పీవీ సింధు


పతకాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతూ.. భారతదేశ ప్రతిష్టను పెంచేందుకు అనునిత్యం కష్టపడుతున్న క్రీడాకారుని, భారత స్టార్ షట్లర్ పీవీ సింధు. తాజాగా ఆమె కమెడియన్, నటుడు అలీ హోస్ట్ చేస్తున్న ‘అలీతో సరదాగా’ కార్యక్రమానికి గెస్ట్‌గా హాజరైంది. ఇప్పటి వరకు ఆమె ఇటువంటి షోలకు హాజరైంది లేదు. అలాగే, అలీ చేస్తున్న ఈ టాక్‌ షోకి ఇప్పటి వరకు సెలబ్రిటీ కాకుండా నాన్ ఫిల్మ్ సెలబ్రిటీ కూడా హాజరైన దాఖలాలు లేవు. ఫస్ట్ టైమ్ ఇది ఈటీవీ వేదికగా జరిగింది. తాజాగా పీవీ సింధు హాజరైన ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఇందులో అలీ అడిగిన ప్రశ్నలకు పీవీ సింధు హ్యుమర్ ప్రదర్శిస్తూ చలాకీగా సమాధానాలు ఇచ్చింది. 

Advertisement
CJ Advs

 

‘నీకు ఇష్టమైన హీరో ఎవరు?’ అని అలీ అడిగితే.. చాలా మంది ఉన్నారని సింధు చెప్పింది. అలా కాదు ఒక్కరి పేరు చెప్పమంటే.. ప్రభాస్ అని తెలిపింది. ఎందుకని సేమ్ హైట్ ఉంటారనా? అని అలీ అనగానే.. హాయిగా నవ్వేసింది. ప్రభాస్ అంటే చాలా ఇష్టం. మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ కూడా అని ఆ తర్వాత సింధు తెలిపింది. ఫ్యూచర్‌లో హీరోయిన్ అయ్యే అవకాశం ఏమైనా ఉందా? అని అలీ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘అవ్వవచ్చేమో.. బహుశా నా బయోపిక్‌లో నేనే యాక్ట్ చేయవచ్చేమో’ అని సింధు సమాధానమిచ్చింది. ఇప్పటి వరకు ఎన్ని లవ్ లెటర్స్ వచ్చాయి? అని అలీ అడిగిన ప్రశ్నకు సింధు ఆసక్తికరమైన సమాధానమిచ్చింది. ‘లెటర్స్ వచ్చాయి. ఇంట్లోని అందరం కలిసి చదువుతుంటాం. కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్.. ఒక 70 ఇయర్స్ ఓల్డ్ మ్యాన్.. నేను సింధూని పెళ్లి చేసుకోకపోతే.. ఆమెని కిడ్నాప్ చేసైనా.. తీసుకెళ్లి పెళ్లి చేసుకుంటాను.. అని రాశాడు. అప్పుడు తెలిసివచ్చింది’ అంటూ సింధు చెప్పిన సమాధానం విని అలీ కూడా ‘ఎవడు వాడు’ అంటూ ఫ్రస్టేట్ అయ్యారు. ఇలా అనేక విషయాలను షేర్ చేసుకున్న సింధు.. తన కోచ్‌తో వచ్చిన కలహాల గురించి కూడా ఈ షోలో షేర్ చేసుకుంది. అవేంటో తెలియాలంటే ఫుల్ ఎపిసోడ్ వచ్చే వరకు వెయిట్ చేయక తప్పదు.

PV Sindhu Alitho Saradaga Promo Highlights:

PV Sindhu Reveals Interesting incidents at Alitho Saradaga
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs