Advertisement
Google Ads BL

చియాన్ విక్రమ్‌కు అదే ఆఖరి సినిమానా?


విలక్షణ నటుడిగా గుర్తింపు పొందిన చియాన్ విక్రమ్.. ప్రస్తుతం ఎస్ డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్‌ అయినటువంటి ‘పొన్నియన్ సెల్వన్’లో కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ఓ పాటను శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు. అయితే ఈ కార్యక్రమంలో చియాన్ విక్రమ్ మాట్లాడిన మాటలపై.. ఇప్పుడు కోలీవుడ్, టాలీవుడ్‌లో చర్చలు నడుస్తున్నాయి. ఇదే తన ఆఖరి సినిమా అన్నట్లుగా ఆయన మాట్లాడటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే ఇటీవల ఆయన ఆరోగ్యం విషయంపై కూడా అనేకానేక రూమర్లు వినిపించాయి. 

Advertisement
CJ Advs

 

రూమర్లు సంగతి పక్కన పెడితే.. ఆయన హాస్పిటల్‌కి వెళ్లింది మాత్రం నిజం. ఆయనకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న మాట కూడా వాస్తవమే. అందుకే, ఇక యాక్టింగ్‌కు స్వస్తి పలకాలని విక్రమ్ నిర్ణయం తీసుకున్నాడేమో.. ఈ పాట విడుదల కార్యక్రమంలో ఇక రిటైర్ అయిపోవచ్చు అన్నట్లుగా మాట్లాడేశారు. మణిరత్నం, శంకర్ సార్‌ల చిత్రాలలో నటిస్తే చాలు. ఇక రిటైర్ అయిపోవచ్చు అన్నట్లుగా ఆయన మాట్లాడారు. నిజంగా రిటైర్‌మెంట్ ఆలోచన లేకపోతే విక్రమ్ ఈ విధంగా మాట్లాడేవారు కాదు. మరి నిజంగానే ఆయన యాక్టింగ్‌కు గుడ్ బై చెప్పాలనుకుంటున్నారో.. లేదంటే క్యాజువల్‌గా అలా అన్నారో తెలియదు కానీ.. ఆయన రిటైర్‌మెంట్ గురించి చేసిన వ్యాఖ్యలు మాత్రం ఇప్పుడు చర్చలకు తావిస్తున్నాయి.

Chiyaan Vikram speech at PS 1 song Launch Crates Sensation:

will chiyaan vikram says goodbye to movies
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs