Advertisement
Google Ads BL

కృష్ణాష్టమి: ట్విన్స్‌కి జన్మనిచ్చిన నమిత


‘సొంతం’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన నమిత.. విక్టరీ వెంకటేష్ ‘జెమిని’ సినిమాతో పాపులారిటీ సంపాదించుకుంది. బాలయ్య ‘సింహ’లో బొద్దుగా కనిపించిన నమితకు తమిళంలో గుడి కూడా కట్టేశారు. అంతటి అభిమానం సొంతం చేసుకున్న నమిత బాగా బరువు పెరిగి అవకాశాలు కోల్పోయింది. హీరోయిన్‌గా అవకాశాలు తగ్గగానే తమిళ బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ తన ప్రత్యేకతని చాటుకుంది. ఆ తర్వాత 2017లో ప్రియుడు, నటుడు వీరేంద్ర చౌదరిని పెళ్లి చేసుకుంది. రీసెంట్‌గానే ప్రెగ్నెన్సీ ఫొటోస్‌ని షేర్ చేసింది కూడా. తాజాగా నమిత కృష్ణాష్టమి రోజున కవలలకు జన్మనిచ్చింది. అదీ కూడా ఇద్దరు పండంటి అబ్బాయిలకి.

Advertisement
CJ Advs

 

ఈ విషయాన్ని స్వయంగా నమిత తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో షేర్‌ చేసుకుంది. నాకు ట్విన్ బాయ్స్ పుట్టారు. కృష్ణాష్టమి రోజున ఈ గుడ్‌న్యూస్‌ను మీతో పంచుకోవడం ఆనందంగా ఉంది. మీ ఆశీర్వాదాలు, ప్రేమ మాపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాము. నాకు డెలివరీ చేసిన ఆసుపత్రి వైద్యులకు, సిబ్బందికి కృతఙ్ఞతలు. నా పిల్లలు భూమి మీదకి వచ్చేవరకు నాకు సహకరించిన వారికి ఎప్పటికి రుణపడి ఉంటాను.. అంటూ నమిత చేసిన పోస్ట్‌తో ఆమెకి స్నేహితులు, సన్నిహితులు, సెలబ్రిటీస్ శుభాకాంక్షలు చెబుతున్నారు.

Actress Namitha delivers twin boys:

Namitha blessed with twin babies
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs