Advertisement
Google Ads BL

ఛార్మితో రిలేషన్‌పై పూరి క్లారిటీ


గత కొన్నాళ్లుగా డైరెక్టర్ పూరి జగన్నాధ్, మాజీ హీరోయిన్ ఛార్మి‌పై రకరకాల రూమర్స్ ప్రచారంలో ఉన్నాయి. పూరి జగన్నాధ్ తన భార్యకి విడాకులిచ్చేసి ఛార్మి‌తో ఉంటున్నాడని, ఛార్మి వలన పూరి జగన్నాధ్ ఫ్యామిలీకి దూరంగా ఉన్నాడని అన్నారు. అంతేకాదు పూరి కొడుకు, అయన భార్య, కూతురు ఇలా ఎవరు మీడియాకి కనబడినా వారికీ ఇదే ప్రశ్న ఎదురవుతుంది. ప్రస్తుతం ‘లైగర్’ ప్రమోషన్స్‌లో బిజీగా వున్న దర్శకుడు పూరిని కూడా మీడియా అదే విషయమై కదిలించగా.. పూరి జగన్నాధ్ కాస్త డిఫరెంట్‌గా జవాబు చెప్పడం ఇంట్రెస్టింగ్‌గా మారింది.

Advertisement
CJ Advs

 

ఛార్మికి, తనకి మధ్యలో ఏదో ఉంది అని ప్రచారం జరగడం చూస్తుంటే.. ఛార్మి గనక 50 ఏళ్ళ అమ్మాయి అయితే జనాలు ఇలాంటి విషయాలు పట్టించుకునేవారు కాదు. ఆమె యంగ్ ఏజ్‌లో ఉంది కాబట్టి.. తామిద్దరి మధ్య ఏదో ఉంది అంటూ ప్రచారం జరుగుతుంది. ఛార్మి తనకు దాదాపుగా 13 ఏళ్ల వయసప్పటి నుంచే తెలుసని.. అంతేకాకుండా తను ఛార్మితో 20 ఏళ్లుగా కలిసి పని చేస్తున్నానని, ఛార్మి ఎంతగా కష్టపడుతుందో తనకి తెలుసు అని, పెళ్లి తర్వాత కోరికలనేవి కొద్దిరోజులకి ఉండవని, కానీ ఫ్రెండ్‌షిప్ మాత్రం శాశ్వతమని, ఆకర్షణ కొద్ది రోజుల్లోనే చచ్చిపోతుందని పూరి ఆన్సర్ ఇచ్చారు. తామిద్దరం మంచి స్నేహితులమంటూ పూరీ.. ఛార్మి రిలేషన్‌పై క్లారిటీ ఇచ్చారు. మరి మన జనాలు నమ్ముతారా?

Puri Jagannadh Clarity about Relation with Charmme Kaur:

Relation between Puri Jagannadh and Charmme Kaur only Friendship
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs