Advertisement
Google Ads BL

‘మాచర్ల’.. నితిన్‌పై ఈ రూమర్లేంటి?


నితిన్ హీరోగా నటించిన ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎటువంటి రిజల్ట్‌ను సొంతం చేసుకుందో తెలిసిందే. రొటీన్ సినిమా అంటూ ప్రేక్షకులు ఈ సినిమాని రిజిక్ట్ చేశారు. అయితే ఈ ఒక్క సినిమాతోనే నితిన్‌పై అనేక రకాలుగా రూమర్లు సోషల్ మీడియాలో వ్యక్తమవుతుండటం విశేషం. అంతకుముందు నితిన్ నటించిన ‘చెక్’, ‘మ్యాస్ట్రో’ చిత్రాలు డిజప్పాయింట్ చేయగా.. ‘రంగ్ దే’ యావరేజ్ హిట్‌గా నిలిచి.. నితిన్‌కు కాస్త ఊరటనిచ్చింది. ఇప్పుడు వచ్చిన ‘మాచర్ల నియోజకవర్గం’ అయితే.. ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే ఫ్లాప్ టాక్‌ని సొంతం చేసుకుంది. నితిన్ పరంగా ఈ సినిమాకి ఎటువంటి ఇబ్బంది లేదు కానీ.. స్టోరీ పరంగానే రొటీన్ మాస్ రివేంజ్ ఫార్ములాగా దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఆఖరికి అంజలితో చేసిన ఐటమ్ కూడా సినిమాని గట్టెక్కించలేకపోయింది. 

Advertisement
CJ Advs

 

ఇక ఈ సినిమా రిజల్ట్ అనంతరం నితిన్ కెరీర్ అయిపోయిందంటూ రూమర్లు ప్రత్యక్షమవుతుండటం విశేషం. అలాగే, నితిన్ తన సినిమా కథల విషయంలో తన తండ్రి మాటలు వింటున్నాడని, అందుకే ఆయనకు హిట్ రావడం లేదంటూ కూడా పుకార్లు షికారు చేస్తుండటం గమనార్హం. నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డే.. ‘మాచర్ల నియోజకవర్గం’ చిత్రాన్ని నిర్మించారు. అయితే వినిపిస్తున్న రూమర్లలో అర్థం పర్థం లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే, ఎవరూ డబ్బులు పోగొట్టుకోవాలని అనుకోరు కదా. కథ అనుకున్నప్పుడు.. ఒకరిద్దరి ఓపెనీయన్ అయితే తీసుకుంటారు. నితిన్ కూడా ఓకే చెప్పాకే సినిమా సెట్స్‌పైకి వెళుతుంది. అందులోనూ సొంత బ్యానర్‌ అంటే నితిన్ కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఒక్కోసారి సినిమా రిజల్ట్‌‌ని అంచనా వేయడం కష్టం. అదే ఈ సినిమా విషయంలో జరిగింది. అంతే తప్ప, నితిన్ తన తండ్రి మాట వినడం వల్లే ప్లాప్స్ వస్తున్నాయి.. అనే రూమర్లు అస్సలు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎటువంటి కథతో సినిమా చేసినా.. ప్రేక్షకులకు నచ్చడం లేదు. సో.. కథ పరంగా నితిన్ జాగ్రత్తలు తీసుకోవాలని చెబితే బాగుంటుంది కానీ.. తండ్రి వల్లే ప్లాప్స్ అనడం ఏమాత్రం కరెక్ట్ కాదు. గాసిప్ రాయుళ్లు ఇది అర్థం చేసుకుంటే బెటర్.

Rumors on Nithiin with Macherla Niyojakavargam result:

Nithiin Macherla Niyojakavargam Movie Failed at Box Office
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs