Advertisement
Google Ads BL

జేజమ్మకి ఆ సినిమా తెగ నచ్చేసింది!


జేజమ్మ అనుష్క కొంతకాలంగా సైలెంట్‌గానే ఉంటుంది. ప్రస్తుతం ఓ సినిమా చేస్తున్నట్లుగా వార్తలైతే వినబడుతున్నాయి కానీ.. ఆ సినిమాకు సంబంధించి ఎటువంటి అప్‌డేట్ మాత్రం రావడం లేదు. ఇలా అయితే, ఇంకొన్ని రోజులకు అనుష్క పేరు ఇండస్ట్రీ మరిచిపోవడం ఖాయం. ఇప్పటికే ఆమె పేరు చాలా వరకు వినిపించడం తగ్గిపోయింది. అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో మినహా.. అనుష్క ప్రస్తావన ఎక్కడా రావడం లేదు. తాజాగా అనుష్కకు ఓ సినిమా బాగా నచ్చేసింది. దీంతో ఆ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తూ.. మరోసారి వార్తలలో అనుష్క ప్రత్యక్షమైంది.

Advertisement
CJ Advs

 

టాలీవుడ్‌కి సక్సెస్‌లు రావడం లేదనుకున్న టైమ్‌లో.. ఇండస్ట్రీకి కొత్త ఊపిరి పోసిన చిత్రం ‘సీతా రామం’. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ అద్భుతం, దృశ్యకావ్యం అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. అనుష్క కూడా ఈ సినిమాపై దాదాపు అటువంటి కామెంట్లే చేసింది. ‘‘సీతా రామం చిత్రం బ్యూటీఫుల్ మూవీ. సీతారాముల సున్నితంగా వారి జర్నీలోకి తీసుకెళ్లారు. సీత, రామ్, అఫ్రీన్‌లకు, ఇతర నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, దర్శకనిర్మాతలకు హృదయపూర్వక అభినందనలు..’’ అంటూ అనుష్క ఈ సినిమా గురించి చెప్పుకొచ్చింది. సినిమా సంగతి అటుంచితే.. కనీసం ఈ విధంగానైనా ఆమె టచ్‌లోకి వచ్చినందుకు ఆమె అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తూ.. ఆమె ఆగమనం కోసం వెయిట్ చేస్తున్నామని.. సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తుండటం విశేషం.

Anushka Shetty Praises on Sita Ramam Movie:

Anushka Shetty watches Sita Ramam Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs