Advertisement
Google Ads BL

ఇండస్ట్రీపై అనసూయ ఓపెన్ కామెంట్స్


ప్రస్తుతం అనసూయ జబర్దస్త్ వదిలేసినా ఆమెని జబర్దస్త్ విషయాలు ఇంకా నీడలా వెంటాడుతూనే ఉంది. తొమ్మిదేళ్లుగా జబర్దస్త్ ని ఏకచత్రాధిపత్యంగా ఏలిన అనసూయ ఇప్పుడు జబర్దస్త్ ని వదిలెయ్యడం అందరిలో హాట్ టాపిక్ అవుతూనే ఉంది. కానీ అనసూయ జబర్దస్త్ నుండి వచ్చాక ఇండస్ట్రీ పై, జబర్దస్త్ పై సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. జబర్దస్త్ లో మాపై వేసే పంచ్ లకి మేము మొహం మాడ్చుకున్నా అది జబర్దస్త్ లో చూపించరు. అది తట్టుకోలేకే జబర్దస్త్ మానెయ్యాలనుకున్నా అంటూ సెన్సేషనల్ గా మాట్లాడిన అనసూయ ఇప్పుడు ఇండస్ట్రీలో హీరోయిన్స్ పరిస్థితిపై సంచలన వ్యాఖ్యలు చేసింది.

Advertisement
CJ Advs

హీరోయిన్స్ అంటే కెమెరా ముందు సిగ్గుపడుతూ, గ్లామర్ షో చేస్తూ.. కాపాడండి అని అనాలి.. జస్ట్ అంతే హీరోయిన్స్ అంటే అంటూ దుమారం రేపే మాటలు మాట్లాడింది. అంతేకాకుండా పోకిరి సినిమాలో గిల్లితే గిల్లించుకోవాలి అనే డైలాగ్‌ ఉంది కదా.. అలా ఉంటుంది మా పరిస్థితి.. దేవదాసీల్లాగ పనిచేయాలి. కానీ మా హక్కుల కోసం మాట్లాడితే మమ్మల్ని తొక్కేస్తారు. మేము కష్టపడే పని చేస్తున్నాం, మాట్లాడితే తప్పు, మాట్లాడకుండా ఉంటే తప్పు. అందరికి కనిపించేంతగా హుందాగా సినీ లైఫ్ ఉండదు అంటూ అనసూయ ఇండస్ట్రీపై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Anasuya Bharadwaj speaks on women rights:

Anasuya shared her personal details and talked about the importance given to heroines in the industry
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs