Advertisement
Google Ads BL

ఫ్లాష్ : SSMB 28 కోసం సెన్సేషనల్ డేట్


SSMB 28 మూవీకి సంబంధించి ఈ రోజు [18-08-2022] ఈవెనింగ్ సర్ ప్రైజింగ్ అప్ డేట్ రాబోతోంది అంటూ ఉదయాన్నే ట్వీట్ చేసిన నిర్మాత నాగ వంశీ సాయంత్రం 5 గంటలకి SSMB 28 విడుదల తేదీ రూపంలో ఆ తీపి కబురు చెప్పేసారు. 28 ఏప్రిల్ 2023 న SSMB 28 గ్రాండ్ రిలీజ్ ఉంటుందని ఎనౌన్స్ చేస్తూ సూపర్ స్టార్ ఫ్యాన్సుకి సూపర్ అప్ డేట్ ఇచ్చారు. 

Advertisement
CJ Advs

అతడు, ఖలేజా వంటి రిపీట్ వేల్యూ వున్న సినిమాలను అందించిన మహేష్ - త్రివిక్రమ్ కాంబో అంటేనే అంచనాలు ఆకాశాన్నంటుతాయి. అందులోను వరుస విజయాలతో వున్న మహేష్ తో  ఆల వైకుంఠపురం వంటి బ్లాక్ బస్టర్ తర్వాత త్రివిక్రమ్ చేస్తోన్న సినిమా కావడంతో అభిమానుల ఆశలు అవధుల్లేనంత ఎదిగిపోతున్నాయి. ఇక ఈ చిత్రానికి మాంచి సెన్సేషనల్ రిలీజ్ డేట్ కూడా సెట్ అయింది కనుక బాక్సాఫీస్ దగ్గర జాతరే.!

ఇంతకీ ఆ డేట్ స్పెషాలిటీ ఏంటో మీకింకా అర్ధం కాలేదా.. సమ్మర్ హాలిడేస్ కి సరిగ్గా కుదిరే తేదీ మాత్రమే కాదది - టాలీవుడ్ కి పలు ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన డేట్. ముఖ్యంగా ప్రిన్స్ మహేష్ ని ఒక్కసారిగా సూపర్ స్టార్ మహేష్ ని చేసేసిన ఇండస్ట్రీ హిట్ పోకిరి రిలీజ్ డేట్ ఏప్రిల్ 28. ఇక అదే డేట్ సెట్ చేసినట్టే అదే ఫీట్ కూడా రిపీట్ చేయగలిగితే SSMB 28 తో సరికొత్త రికార్డులు ఆవిర్భవించడం తథ్యం.!

మరి రిలీజ్ డేట్ ఎనౌన్స్ మెంట్ లోనే Be Ready For The Massive & Epic Blast At The Screens అంటూ హింట్ ఇచ్చారంటే త్రివిక్రమ్ హంటింగ్ ఏ రేంజ్ లో ఉంటుందో.. మహేష్ మ్యాజిక్ మరెన్ని వండర్స్ చూపిస్తుందో 🌟

SSMB 28 Arriving on 28th April 2023:

Sensational Release Date Locked For SSMB28 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs