బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ కి వెండితెర మీద చెప్పుకునేంత హిట్ లేదు. వరస సినిమాలు చేస్తుంది కానీ.. సక్సెస్ మాత్రం దొరకడం లేదు. సోషల్ మీడియాలో మాత్రం జాన్వీ కపూర్ ఫోటో షూట్స్ కి విపరీతమైన గిరాకీ. జాన్వీ కపూర్ చేసే గ్లామర్ షో రచ్చ, బికినీ రచ్చ కి యూత్ కి మైకం కమ్మాల్సిందే. క్లివేజ్ షో, అందాల ఆరబోత, జిమ్ డ్రెస్సులతో మత్తెక్కించే జాన్వీ కపూర్ ఇష్టపడిన వాళ్ళందరిని పెళ్లి చేసుకోలేం కదా అంటూ సంచలనంగా మాట్లాడుతుంది. తన తల్లి శ్రీదేవి, తండ్రి బోని కపూర్ లకి డేటింగ్ కాన్సెప్ట్ అస్సలు నచ్చదని చెబుతుంది.
తనకి నచ్చిన వాడిని పెళ్లి చేసుకోవాలని వాళ్ళ కోరిక అంటుంది. అందుకేనేమో జాన్వీ కపూర్ పై ఇలాంటి డేటింగ్ రూమర్స్ ఎక్కడా వినిపించలేదు. అలాగే ఆమెకి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడనే ప్రచారం కూడా లేదు. డేటింగ్ కల్చర్ అనేది నా పేరెంట్స్ కి నచ్చదని, అందుకే నీవు ఎవరైనా అబ్బాయిని ఇష్టపడితే మా దగ్గరకు తీసుకురా, పెళ్లి చేస్తాం అంటూ చెప్పేవారని, కానీ నచ్చిన ప్రతి వ్యక్తిని పెళ్లాడలేము కదా. మనకు కొంచెం చిల్ కూడా ఉండాలి అంటూ ఫన్నీ గా పెళ్లి, డేటింగ్ పై జాన్వీ కపూర్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.