సర్కారు వారి పాటతో హిట్టు కొట్టినా మహేష్ ఇప్పటివరకు తన నెక్సెట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిందే లేదు.
అల వైకుంఠపురంలో వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన తర్వాత త్రివిక్రమ్ మళ్ళీ మెగా ఫోన్ పట్టిందే లేదు.
ఈ నేపథ్యంలో మహేష్ - త్రివిక్రమ్ చేయనున్న SSMB 28 కోసం ప్రేక్షకాభిమానులు ఎంతగా ఎదురు చూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఆగష్టు 9 మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా ఈ సినిమా డీటెయిల్స్ ఎనౌన్స్ చేస్తారని అంతా ఎదురు చూస్తే సింపుల్ గా ఓ పోస్టర్ తో విషెస్ చెప్పి సరిపెట్టేసారు. మొన్న ఆగష్టు 15 న షూటింగ్ షెడ్యూల్ వివరాలు వెల్లడవుతాయని వినిపించినా అదీ జరగలేదు. మొత్తానికి ఎట్టకేలకు నేడు [18-08-2022] ఆ గుడ్ న్యూస్ వినిపించారు నిర్మాత నాగవంశీ.
ఈ మేరకు ట్విట్టర్ వేదికగా అధికారిక ప్రకటన ఇస్తూ... మీరు ఎంతగా వెయిట్ చేస్తున్నారో, మమ్మల్ని ఎన్ని అనుకుంటున్నారో తెలుసు. ఇక కొంచెం రిలాక్స్ అవ్వండి. ఈ రోజు ఈవెనింగ్ SSMB 28 గురించి ఒక సర్ ప్రైజింగ్ అప్ డేట్ రాబోతోంది అంటూ ఫాన్స్ లో జోష్ తెచ్చారు.
అయితే పర్టిక్యులర్ గా ఇదీ టైమ్ అని చెప్పకపోయినా ఈ రోజు సాయంత్రానికే మహేష్ - త్రివిక్రమ్ ల మ్యాజికల్ మూవీపై అప్ డేట్ వింటామనే ఆనందం వ్యక్తమవుతోంది మహేష్ ఫ్యాన్సులో.!
సరే.. మరికాసేపట్లో ఆ SSMB 28 సర్ ప్రైజ్ ఏంటో మనమూ చూద్దాం. దానిపై చక్కగా చర్చిద్దాం. మీరు కూడా stay tuned cinejosh 🌟