పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ - పాన్ ఇండియా సెన్సేషన్ ప్రశాంత్ నీల్ కలయికలో మాస్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ తెరకెకెక్కుతున్న సలార్ మూవీ పై ట్రేడ్ లో విపరీతమైన క్రేజ్ ఉంది. అటు పాన్ ఇండియా ప్రేక్షకుల్లోనూ భీభత్సమైన అంచనాలున్నాయి. సలార్ వచ్చే ఏడాది సెప్టెంబర్ లో రిలీజ్ చేస్తున్నట్టుగా మేకర్స్ బిగ్ అప్ డేట్ ఇచ్చారు కూడా. ఇక అక్టోబర్ లో ప్రభాస్ బర్త్ డే వరకు సలార్ టీజర్ వదలరని తెలుస్తుంది. బర్త్ డే ట్రీట్ గా సలార్ టీజర్ వదులుతారని సమాచారం. అయితే సలార్ లో ప్రభాస్ కి మెయిన్ విలన్ గా మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కనిపిస్తారని టాక్ ఉంది. ఎందుకంటే పృథ్వీరాజ్ ఈ సినిమాలో కీలకపాత్రలో కనిపించబోతున్నారు.
ప్రభాస్ తో తలపడబోయే మెయిన్ విలన్ పృథ్వీ రాజే అని ప్రచారం జరుగుతుండగా... ఇప్పుడు సలార్ లో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా చేయనున్నాడని కొంతమంది అంటున్నారు. అసలు ఆయన ఏ రోల్ చేసినా ప్రభాస్ కటౌట్ కి కరెక్ట్ మొగుడు పృథ్వీ రాజే అవుతాడని ప్రభాస్ ఫాన్స్ సంబరపడిపోతున్నారు. అంటే విలన్ అయినా, పోలీస్ ఆఫీసర్ అయినా ప్రభాస్ కి పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతారని అంటున్నారు. ఈ సినిమాలో శృతి హాసన్ కథానాయికగా కనిపించబోతుంది. అంతేకాకుండా సలార్ లో 15 మంది విలన్స్ ఉండబోతున్నట్లుగా టాక్ ఉంది.