Advertisement
Google Ads BL

నెటిజన్లపై అర్జున్ కపూర్ హాట్ కామెంట్స్


సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత చాలామంది నెటిజెన్స్ స్టార్ కిడ్స్ ని ట్రోల్ చెయ్యడమే కాదు, బాలీవుడ్ బాయ్‌కాట్‌ టాగ్స్ తో రెచ్చిపోయి ట్రెండ్ చేస్తున్నారు. ఈ మధ్యన బాలీవుడ్ లో ఏ సినిమా రిలీజ్ అయినా.. ఆ సినిమా రిలీజ్ కాకుండానే ఆ సినిమాపై నెగెటివిటి చూపిస్తున్నారు. అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా, అలియా భట్ డార్లింగ్స్, హ్రితిక్ రోషన్ విక్రమ్ వేద, షారుఖ్ పటాన్ మూవీ ఇలా నెటిజెన్స్ బాలీవుడ్ పై విషం చిమ్ముతున్నారు. అయితే చాలామంది ఈ బాయ్‌కాట్‌ బాలీవుడ్ పై రకరకాలుగా స్పందిస్తూనే ఉన్నారు.

Advertisement
CJ Advs

తాజాగా అర్జున్ కపూర్ బాయ్‌కాట్‌ బాలీవుడ్ గురించి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. ఇప్పటి వరకు బాయ్‌కాట్‌పై మౌనంగా ఉండి తప్పుచేశాం. అది మా మర్యాద అనుకున్నాం. ఇన్నాళ్లు మా పనితనమే దీనికి సమాధానం ఇస్తుందని అనుకుని పొరపాటు చేశాం. కానీ కొందరు కావాలనే ప్రయోజం పొందడం కోసం ఇదంతా మొదలు పెట్టారు. బురదలో చేయి పెట్టడం ఎందుకని మేం అనుకుంటుంటే. మా సహనాన్ని ఇంకా ఇంకా పరీక్షిస్తున్నారు. ఈ నెగెటివిటీని ఎదుర్కొవాలంటే బాలీవుడ్ అంతా ఏకం కావాలి అంటూ చెప్పిన అర్జున్ కపూర్.. ప్రతి ఫ్రైడే మూవీ రిలీజ్ అవుతుంది అంటే ఆడియన్స్ ఉత్సాహం గా ఎదురు చూసేవారు, కానీ సినిమాలని బహిష్కరించాలంటూ ఇంత నెగెటివిటి చూపించడం ఎవరికీ మంచిదికాదు సినిమా విడుదల తర్వాత ఎలా ఉంటుందో చూసి ప్రేక్షకుల ఆలోచన మారుతుంది అని భావిస్తున్నాం.. అంటూ ట్వీట్ చేసాడు.

Arjun Kapoor on Boycott trend against Bollywood:

Arjun Kapoor reacts to Boycott Bollywood trend
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs