Advertisement
Google Ads BL

బోల్డ్ ఫోటోతో.. బేబీ బంప్‌ని రివీల్ చేసింది!


బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ బిపాసా బసు.. తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘టక్కరిదొంగ’ చిత్రంలో బిపాసా బసు తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఆ సినిమా హిట్టయి ఉంటే.. తెలుగులో ఆమెకు మరింతగా గుర్తింపు వచ్చేదే.. కానీ, ఆ సినిమా రిజల్ట్‌తో మళ్లీ ఆమె టాలీవుడ్ వైపు చూడలేదు. అయితే బాలీవుడ్‌లో ఆమె చేసిన చిత్రాలు, వాటిలో ఆరబోసిన అందాలు.. ఆమెనెప్పుడూ టాప్ ప్లేస్‌లోనే నిలిపాయి. సోషల్ మీడియాలో కూడా బిపాసా అందాల ప్రదర్శనతో ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతూనే ఉంది. బోల్డ్ బ్యూటీ ట్యాగ్‌తో బాలీవుడ్‌ని అల్లాడించిన ఈ బ్యూటీ.. 2016లో కరణ్ సింగ్ గ్రోవర్‌ అనే మోడల్ కమ్ నటుడిని వివాహమాడింది. అతనికిది మూడో వివాహం. వివాహం తర్వాత కూడా బిపాసా తన గ్లామర్ షోని కంటిన్యూ చేస్తూనే ఉంది. ఆమె గర్భవతి అయినట్లుగా ఇటీవల బిపాసా ప్రకటించిన విషయం తెలిసిందే. 

Advertisement
CJ Advs

 

ప్రెగ్నెంట్ అని చెబుతూ.. ఆమె తన పర్సనల్ ఫొటోలను కొన్ని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ వస్తుంది. అయితే తాజాగా ఆమె బేబీ బంప్ ఫొటోని సోషల్ ప్రపంచానికి వదిలింది. ఈ ఫొటోలో బోల్డ్‌గా దర్శనమిచ్చి.. మరోసారి తను ఆ పేరుకి ఎంత స్పెషలో తెలియజెప్పే ప్రయత్నం చేసింది. ఈ బోల్డ్ పిక్ చూసిన వారంతా ఒకింత ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఈ మధ్య కాలంలో బేబీ బంప్ ప్రదర్శించడం అనేది కామన్ అయిన నేపధ్యంలో.. ఇంత హాట్‌నెస్‌తో మాత్రం ఎవరూ బేబీ బంప్‌ని రివీల్ చేయలేదు. బేబీ బంప్‌ని తన భర్త ముద్దాడుతోన్న ఫొటోతో పాటు.. వారిద్దరూ ఎంత ప్రేమగా ఉన్నారో తెలిసేలా కొన్ని ఫొటోలను బిప్స్ రివీల్ చేసింది. ఆమె వదిలిన ఈ ఫొటోలపై ప్రస్తుతం హాట్‌హాట్‌గా కామెంట్స్ పడుతుండటం విశేషం.

Bipasha Basu bold baby bump Photo creates sensation:

Bipasha Basu and Karan Singh Grover announce pregnancy
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs