ఈమధ్యన బండ్ల గణేష్ కి వేదాంతం ఒంటబట్టినట్లుగా కనిపిస్తుంది. ఎందుకంటే చాలా విషయాల్లో బండ్ల గణేష్ ఆచి తూచి ట్వీట్స్ చేస్తున్నాడు. మొన్నీమధ్యనే ఇండస్ట్రీ లో టికెట్ రేట్స్ తగ్గించమని అడగడం మానేసి మంచి సినిమాలు చెయ్యండి, కంటెంట్ ఉన్న సినిమాలకు ప్రేక్షకాదరణ ఎలా ఉంటుంది అనేది నిఖిల్ కార్తికేయ, కళ్యాణ్ రామ్ బింబిసార చూస్తే తెలుస్తుంది, గాల్లోకి కార్లు లేపి సినిమా చేస్తే ఎవరూ చూడరు. మంచి కంటెంట్ కావాలి అంటూ లెక్చర్ ఇచ్చాడు.
తాజాగా బండ్ల అన్నా పవన్ కళ్యాణ్ గారితో సినిమా ఎప్పుడు అన్నా, ఒక్కసారి కొంచెం క్లారిటీ ఇవ్వు అన్నా, అసలు ఉందా లేదా అర్థం అవ్వడం లేదు అన్నా🙏please respond ganesh అన్నా అంటూ ఓ అభిమాని బండ్ల ని టాగ్ చేస్తూ ట్వీట్ చేసాడు.
దానితో బండ్ల గణేష్ ఎంతో బాధ్యతగా మాట్లాడుతూ.. మనది నిజమైన అభిమానం అయితే, మనం నిజంగా ఆయన ప్రేమిస్తే, ఆయన చేయబోతున్న కార్యక్రమానికి మంచి కలగాలని కోరుకుందాం సినిమా వ్యాపారం, ఆయన్ని దయచేసి ఇబ్బంది పెట్టకూడదు. ఇది మన బాధ్యత. ఆయన స్థానం వేరు, ఆయన స్థాయి వేరు 🙏🔥🔥🔥🐅@PawanKalyan అంటూ ఆ అభిమానికి రిప్లై ఇవ్వడం చూస్తే నిజంగా ముచ్చటేస్తుంది.