రామ్ పోతినేని నేను శైలజ తో హీరోయిన్ గా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్ ఆ తర్వాత పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోలతో నటించినా రాని ఫేమ్, క్రేజ్ ఒక్క మహానటితో వచ్చేసింది. మహానటి సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ అభినయం, ఆమె పెరఫార్మెన్స్, ఆ బాడీ లాంగ్వేజ్ అన్ని సినిమాకి బలమవ్వగా.. ఆ కేరెక్టర్ కీర్తి సురేష్ కెరీర్ లోనే టాప్ గా నిలిచిపోయింది. మహానటి తో జాతీయ అవార్డు అందుకున్న కీర్తి సురేష్ మహేష్ తో చేసిన సర్కారు వారి పాటలో కళావతిగా గ్లామర్ గాను రెచ్చిపోయింది. అయితే మహానటి సినిమా ని అనుకున్నప్పుడు హీరోయిన్ గా ఫస్ట్ చాయిస్ కీర్తి సురేష్ కాదట. సావిత్రి పాత్రకి ముందుగా నిత్య మీనన్ ని అనుకున్నారట. ఆల్మోస్ట్ నిత్య మీనన్ కూడా ఫైనల్ అన్న తరుణంలో ఆ ప్లేస్ లోకి కీర్తి సురేష్ వచ్చిందట.
తాజాగా వైజయంతి మూవీస్ అధినేత అశ్విని దత్ మహానటి లో కీర్తి సురేష్ ఎలా వచ్చిందో.. నిత్య ఎందుకు తప్పుకుందో వివరించారు. నిత్యా మీనన్ పేరు బయట పెట్టకుండా కీర్తి సురేష్ కన్నా ముందు ఓ మలయాళీ నటిని హీరోయిన్ గా అనుకున్నాము. కానీ ఆమె కథ విన్నాక డ్రింక్ చేసే సీన్స్ లో నటించలేను. ఆ సీన్స్ లేకపోతె చేస్తాను అని కండిషన్ పెట్టింది. దీంతో ఆ హీరోయిన్ ని తీసుకోవడానికి వీల్లేదు అని నేనే డైరెక్టర్ నాగ్ అశ్విన్‌కు చెప్పడంతో కీర్తి సురేష్ చేతుల్లోకి మహానటి అవకాశం వెళ్లింది అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఆయన నిత్య పేరుని డైరెక్ట్ గా బయట పెట్టలేదు. కానీ అప్పట్లో నిత్య మీనన్ మహానటిగా ఫైనల్ అన్నారు కూడా. అది ఇప్పుడు అశ్విని దత్ ఇలా బయటపెట్టారు.