Advertisement
Google Ads BL

మహేష్ తో సెల్ఫీ.. ఇంటెర్నెట్ షేక్


సూపర్ స్టార్ మహేష్ బాబు తో ఫోటో అంటే మాటలా.. అందుకే ఇంటర్నెట్ లో ఆ పిక్ క్షణాల్లో వైరల్ అయ్యింది. మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ తో చెయ్యబోయే SSMB28 కోసం మేకోవర్ అవుతున్నారు. దానికోసమే జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ కష్టపడుతున్నారు. అది కూడా గతంలో ఎన్టీఆర్ కి ఫిట్ నెస్ ట్రైనెర్ గా ఉన్న స్టీవెన్స్ ఆధ్వర్యంలో. అరవింద సమేత, ట్రిపుల్ ఆర్ చిత్రాల్లో ఫిట్ గా కనిపించేందుకు ఎన్టీఆర్ ఈ స్టీవెన్స్ ని ఫిట్ నెస్ ట్రైలర్ గా పెట్టుకున్నారు. అరవింద సమేతలో ఎన్టీఆర్ చాలా ఫిట్ గా కనిపించడమే కాదు.. చివరి వరకు ఒకే లుక్ లో కంటిన్యూ అయ్యారు. ఇక ట్రిపుల్ ఆర్ లో ఎన్టీఆర్ రకరకాల బాడీ లాంగ్వేజెస్ చూపించారు. సాంగ్స్ లో ఒకలా, యాక్షన్ సన్నివేశాలలో మరోలా.. అలాగే పులితో ఫైట్ అప్పుడు ఇంకోలా.. ఇలా డిఫరెంట్ వేరియేషన్స్ చూపించాడనికి ఆయన జిమ్ లో పడిన కష్టమే. దానికి ఈ స్టీవెన్స్ సహకారం అందించారు.

Advertisement
CJ Advs

ఇప్పుడు ఎన్టీఆర్ ట్రైనర్ స్టీవెన్స్ మహేష్ బాబు ని ఫిట్ గా చూపించేందుకు రెడీ అయ్యారు. మహేష్ ని SSMB28 లో పూర్తి ఫిట్ నెస్ తో కొత్త గా చూపించేందుకు మహేష్ కి సహాయపడనున్నారు. అందులో భాగంగానే మహేష్ తో స్టీవెన్స్ తీసుకున్న సెల్ఫీ సోషల్ మీడియాలో షేర్ చెయ్యగానే.. అది క్షణాల్లో వైరల్ అయ్యింది. ఈ సెల్ఫీలో మహేష్ తల మీద క్యాప్ పెట్టుకుని చిన్నపాటి షేవింగ్ తో స్మైల్ చేస్తూ కనిపించారు. 

Mahesh Babu with his trainer Lloyd Stevens:

NTR trainer roped in by Mahesh Babu
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs