Advertisement
Google Ads BL

కూతురు విషయంలో టెన్షన్ పడుతున్న శంకర్


దర్శకుడు శంకర్ రామ్ చరణ్ తో చెయ్యాల్సిన RC15 షూటింగ్ ఆగిపోవడంతో కమల్ హాసన్ తో చెయ్యాల్సిన భారతీయుడు 2 పై ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే కాజల్ అగర్వాల్ సెప్టెంబర్ నుండి భారతీయుడు 2 షూటింగ్ లో పాల్గొనబోతున్నట్లుగా చెప్పడంతో శంకర్ RC15 ని పక్కనబెట్టి భారతీయుడు షూటింగ్ కి వెళతారని ఫిక్స్ అయ్యింది. అయితే దర్శకుడిగా కూల్ గా పని చేసుకునే శంకర్ తన కూతురు విషయంలో టెన్షన్ పడుతున్నట్టుగా తెలుస్తుంది. పెద్ద కూతురు అదితి శంకర్ సినిమాల్లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆమె హీరోయిన్ గా మారడం శంకర్ కి ఇష్టం లేదట. తాను డాక్టర్ చదివాను అని, హీరోయిన్ గా ప్రూవ్ చేసుకోలని ఉంది అని, ఒకవేళ హీరోయిన్ గా సక్సెస్ కాకపోతే మళ్ళీ డాక్టర్ వృత్తి చేపడతాను అని తండ్రికి నచ్చజెప్పడంతో శంకర్ ఆమె సినీ ఎంట్రీకి ఒప్పుకున్నారట. 

Advertisement
CJ Advs

ఆయనకి తెలుసు కదా ఇండస్ట్రీలో పరిస్థితులు ఎట్లా ఉంటాయో, అందుకే.. ఆయన కూతురు విషయంలో రిస్క్ తీసుకోవడం ఇష్టం లేకే వద్దన్నారట. ముత్తయ్య దర్శకత్వంలో కార్తీ హీరోగా విరుమాన్‌ చిత్రం ద్వారా ఆమె ఇండస్ట్రీలోకి వచ్చింది. ఆ సినిమాలో హీరో కార్తీ కావడంతో అదితి అందులో నటించడానికి శంకర్‌ అంగీకరించాట. కానీ ఇప్పుడు అదితికి శింబు మూవీలో ఆఫర్ రాగా.. శంకర్ మాత్రం ఆ సినిమా చెయ్యడానికి ఒప్పుకోవడం లేదట. శింబు చాలామంది హీరోయిన్స్ తో ఎఫ్ఫైర్స్ నడపడం, వివాదాస్పద హీరోగా పేరుండడం వంటి విషయాలే అదితి శింబు తో చెయ్యడానికి శంకర్ ఒప్పుకోవడం లేదని కోలీవుడ్ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Shankar is tensed about his daughter Aditi:

Shankar daughter Aditi Shankar on making debut with Viruman
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs