Advertisement
Google Ads BL

మెగా ఫాన్స్ vs అల్లు ఫాన్స్


ఒక్కోసారి విపరీతమైన అభిమానం స్టార్ హీరోల కొంప ముంచేవరకు తీసుకువస్తుంది. ఫాన్స్ హీరోలని అభిమానిస్తారు, అలాగని అభిమానం తో ఆగరు ప్రాణాల మీదకి తెచ్చుకుంటారు. ఒక్కోసారి అదే అభిమానం వెగటు పుట్టిస్తుంది కూడా. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అనే ప్రాసెస్ లో బూతులు తిడుతూ చెలరేగిపోవడమే కాదు, ఒకరిపైకి ఒకరు వెళ్లేంతగా పగలు పెంచుకుంటారు. అప్పుడప్పుడు ఉచ్ఛం నీచం మర్చిపోయి అసభ్యకరమైన పదజాలం తో తిట్టుకుంటారు. అభిమానం వెర్రి తలలు వెయ్యడం అంటే ఇదే. తాజాగా సోషల్ మీడియా ట్విట్టర్ హ్యాండిల్ లో మెగా ఫాన్స్ vs అల్లు ఫాన్స్ అన్న రేంజ్ లో వార్ మొదలయ్యింది. 

Advertisement
CJ Advs

ఈ రోజు ఉదయం నుండి ట్విట్టర్ లో రామ్ చరణ్ పర్సనల్ లైఫ్ ని ఎటాక్ చేస్తూ గంట కొట్టే వారసుడు లేడు #GhantaLeniVarasudu అంటూ ఓ హ్యాష్ టాగ్ క్రియేట్ చేసి నెట్టింట రచ్చమొదలుపెట్టారు. ఎన్టీఆర్ తన కొడుకు తో గంట కొట్టే వీడియో ని షేర్ చేస్తూ అల్లు ఫాన్స్ రామ్ చరణ్ పై విషం చిమ్ముతున్నారు. అది చూసిన చరణ్ ఫాన్స్, మెగా ఫాన్స్ ఊరుకుంటారా.. అల్లు ఫాన్స్ కి దిమ్మతిరిగే కౌంటర్ ఎటాక్ చేస్తున్నారు. మా హీరోని కామెంట్ చేస్తారా అంటూ ఫైర్ అవ్వడమే కాదు అల్లు అర్జున్ పై విరుచుకుపడుతున్నారు. #ThammudiGhantaPhalAAm అనే హ్యాష్ టాగ్ తో అల్లు ఫ్యామిలీని అసభ్యకరంగా ట్రోలింగ్ చేస్తున్నారు. మాట్లాడుకోవడానికి అస్సహ్యంగా ఉన్న మాటలతో ట్రెండ్ చేస్తూ దిగజారుడు తనంతో ప్రవర్తిస్తున్నారు ఫాన్స్. సోషల్ మీడియా లో మెగా ఫాన్స్ vs అల్లు ఫాన్స్ వార్ ఎక్కడికి దారితీస్తుందో అనేది అర్ధం కావడం లేదు. మరోపక్క ఈ విషయమై మెగా కాంపౌండ్ నుండి ఎలాంటి స్పందన లేదు.

Mega fans vs Allu fans:

GhantaLeniVarasudu - ThammudiGhantaPhalAAm hashtags trends on Twitter
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs