సౌత్ సినిమాలు హిట్ అయ్యిపోతుంటే బాలీవుడ్ హీరోలకి రోజు రోజుకి టెన్షన్ పెరిగిపోతుంది. అటు చూస్తే నెటిజెన్స్ కూడా సౌత్ సినిమాలను పొగుడుతూ బాలీవుడ్ సినిమాలను తిట్టిపోస్తున్నారు. సౌత్ సినిమాలపై బాలీవుడ్ అక్కసు వెళ్లగక్కినంత కాలం ఇలాంటి పరాభవం తప్పదు అంటున్నారు. జెన్యూన్ గా ఉండాల్సిన మీడియా కూడా బాలీవుడ్ కే సపోర్ట్ చేస్తూ సౌత్ మూవీస్ పై విషం కక్కుతోంది. బాలీవుడ్ హీరోలు సౌత్ మీద పై చెయ్యి సాధించాడనికి నానా తంటాలు పడుతున్నా వారికి వరసగా పరాభవాలు తప్పడం లేదు.
అయితే సినిమాల్లో కంటెంట్ లేక ఫెయిల్ అవడం అటుంచి.. అసలు బాలీవుడ్ సినిమాలు విడుదలకు ముందు నుండే నెటిజెన్స్ చేతిలో దారుణ పరాభవం చూడాల్సి వస్తుంది. #BoyCottBollywood, #BoyCottLaalSinghChedda, #BoyCottBrahmastra, #BoyCottShahRukhKhanPathaan, #BoyCottVikramVeda, #BoyCottHrithikRoshan, #BoyCottAamirKhan, #BoyCottAliaBhatt అంటూ హాష్ టాగ్స్ ట్రెండ్ చేస్తున్నారు. సినిమాల విడుదలకు ముందే ఇంత నెగిటివిటీ ఉంటే, సినిమాలు రిలీజ్ అయ్యాక ఏమాత్రం నెగెటివ్ టాక్ పడినా.. ఆ సినిమా థియేటర్స్ లో ప్రేక్షకులు లేక షోస్ క్యాన్సిల్ చెయ్యాల్సిన పరిస్థితుల్లో బాలీవుడ్ ఉంది. కేవలం వారు సౌత్ మీద చూపిస్తున్న అక్కసు కారణంగానే ఇదంతా జరుగుతుంది అంటుంటే.. సుశాంత్ రాజ్ ఫుట్ మరణానికి కారణమైన బాలీవుడ్ నెపోటిజాన్ని ఆయన ఫాన్స్, నెటిజెన్స్ కూడా తట్టుకోలేకే బాలీవుడ్ అంటే మండిపడుతున్నారు అంటున్నారు.