అనిల్ రావిపూడి స్క్రిప్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన బాలయ్య బాబు గోపీచంద్ NBK107 సినిమా కంప్లీట్ చేసి ఇమ్మిడియట్ గా NBK108 షూటింగ్ లోకి దిగబోతున్నారు. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటి అంటే అనిల్ రావిపూడి సినిమాతో ఒక కొత్త ట్రెండ్ ని స్టార్ట్ చెయ్యబోతున్నారు బాలయ్య. సీనియర్ హీరోలు ఎటువంటి కథలు చూజ్ చేసుకోవాలి, ఎలాంటి సినిమాలు చెయ్యాలి, ఎటువంటి పాత్రలని ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారు అనే సందిగ్ద అవస్థలో ఉన్న ప్రస్తుత తరుణంలో బాలయ్య తన వయసుకు, తన ఇమేజ్ కి తగ్గ పాత్రని ధైర్యంగా టేకప్ చేసి చెయ్యబోతున్నారు.
ఈ సినిమాలో బాలయ్య కొత్త లుక్ లో కనిపించబోతున్నారు. కొత్తరకమయిన పాత్రని చెయ్యబోతున్నారు. ఇది నిజంగా మంచి పరిణామం అని చెప్పాలి. అలాగే ఇతర సీనియర్ హీరోలందరికీ కూడా ఒక గైడెన్స్ లాంటిది అని చెప్పొచ్చు, బాలయ్య సృష్టించబోతున్న ఈ కొత్తరకమైన ట్రెండ్ తో కథాబలమున్న సినిమాలని మనం ఇంకా సీనియర్ హీరోల నుంచి చాలా చూడబోతున్నాం.