Advertisement
Google Ads BL

డేటింగ్ లో ఉన్నా, పేరు చెప్పను: విజయ్


విజయ్ దేవరకొండ మరికొద్ది రోజుల్లో పాన్ ఇండియా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న హీరో. ప్రస్తుతం ఇండియా వైడ్ ప్రేక్షకులకి చేరువకావడానికి విజయ్ దేవరకొండ లైగర్ ప్రమోషన్స్ తో ప్రతి రాష్ట్రం తిరుగుతున్నాడు. నార్త్ ఇండియా ప్రమోషన్ తో పాటుగా చెన్నై, వరంగల్ అంటూ సౌత్ లోను స్టార్ట్ చేసాడు. అయితే విజయ్ దేవరకొండ ఏ ఇంటర్వ్యూ ఇచ్చినా, లేదంటే ఏ మీడియా మీట్ లో పాల్గొన్నా ఆయనకి తన లవ్ ఎఫ్ఫైర్ గురించి, లేదు అంటే రష్మిక తో డేటింగ్ విషయాలే ప్రశ్నలుగా ఎదురవుతున్నాయి. తాజాగా విజయ్ ఇంగ్లీష్ పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను ఒకరిని లవ్ చేస్తున్నట్లుగా చెప్పి షాకిచ్చాడు. కానీ తన పేరు మాత్రం బయట పెట్టను అంటూ ఖరాఖండిగా చెప్పడం మరింత షాక్ నిచ్చింది.

Advertisement
CJ Advs

నా పర్సనల్ లైఫ్ గురించి అందరితో పంచుకోవడం నాకిష్టం లేదు. నాతో రిలేషన్ లో వ్యక్తి స్వేచ్చని హరించలేను. అది నా హక్కు కాదు, సెలెబ్రిటీ హోదాలో పబ్లిక్ లైఫ్ లో ఉండడానికి నేను ఇష్టపడినా.. నాతో ఉన్నప్పుడు పబ్లిక్ లో ఫోకస్ అవ్వడానికి తనకి ఇష్టం లేకపోవచ్చు అంటూ సంచలనంగా మాట్లాడాడు విజయ్ దేవరకొండ. ఇక ప్రస్తుతం తాను బాలీవుడ్ లో ఏ ప్రాజెక్ట్ ఒప్పుకోలేదు అని, ముందుగా లైగర్ రిలీజ్ ని ఎంజాయ్ చెయ్యాలనుకుంటున్నాను అని, ప్రస్తుతం ఖుషి, జనగణమన పూర్తి చేశాకే తదుపరి ప్రాజెక్ట్ ఓకె చేస్తాను అంటూ ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు విజయ్ దేవరకొండ. 

Vijay Deverakonda opens up on dating rumours:

Liger star Vijay Deverakonda opens up on dating rumours
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs