Advertisement
Google Ads BL

అఖిల్ రీ ఎంట్రీ


బిగ్ బాస్ సీజన్ 4 లో మోనాల్ గజ్జర్ తో నడిపిన లవ్ ట్రాక్ తో ఫెమస్ అయ్యి.. అక్కడ అభిజిత్ విన్నర్ గా నిలవగా అఖిల్ సార్థక్ రన్నర్ గా బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి వచ్చాక వరసగా సినిమాలు ఒప్పేసుకుని బిజీ అవడమే కాదు, బిగ్ బాస్ అగ్రిమెంట్ ముగిసాక అతను పలు ఛానల్స్ లో యాంకరింగ్ మొదలు పెట్టాడు. ఈటివి లో ప్రముఖ రియాలిటీ షో ఢీ డాన్స్ స్టేజ్ పై యాంకర్ గా మెరిశాడు. హైపర్ ఆది పంచ్ లతో పోటీ పడుతూ స్టయిల్ ని మెయింటింగ్ చేసిన అఖిల్ కి మరోసారి బిగ్ బాస్ ఓటిటి ఆఫర్ రావడంతో విన్నర్ అవ్వాలనే కసితో బిగ్ బాస్ ఓటిటిలోకి అడుగుపెట్టాడు.

Advertisement
CJ Advs

చివరి వరకు బిగ్ బాస్ ఓటిటి విన్నర్ అఖిల్ అవుతాడనుకున్నారు. చాలా సెటిల్డ్ గా గేమ్ ఆడుతూ ఆకట్టుకున్న అఖిల్ సార్థక్ కి బిందు మాధవి గట్టి పోటీ ఇవ్వడమే కాదు, అఖిల్ ఆశలపై నీళ్లు చల్లి బిగ్ బాస్ ఓటిటి కిరీటాన్ని పట్టుకుపోవడంతో మరోసారి అఖిల్ రన్నర్ గా స్టేజ్ పై నించోవాల్సి వచ్చింది. బిగ్ బాస్ ఓటిటి ముగిసిన మూడు నెలలకే అఖిల్ ఢీ డాన్స్ షో కి రీ ఎంట్రీ ఇచ్చేసాడు. అది కూడా పంచె కట్టి పెద్దమనిషిలా.. దానితో హైపర్ ఆది రెచ్చిపోయి అఖిల్ మీద పంచ్ లు వేసిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ ఎపిసోడ్ వచ్చే బుధవారం రాత్రి ఈటీవీలో ప్రసారమవుతుంది.

Dhee Dance show: Akhil Sarthak re entry promo:

Dhee: Akhil Sarthak re entry promo viral
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs