చాలామంది హీరోలు టాగ్ లు తగిలించుకోవడానికి తపన పడుతున్న ఈ సమయంలో పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ వచ్చినా, ఇంటర్నేషనల్ మార్కెట్ ఓపెన్ అయినా.. ఇప్పటికి ఎటువంటి టాగ్ కోసం ఆరాటపడకుండా, అలాంటి ఆర్భాటాలకు పోకుండా సింపుల్ గా ప్రభాస్ సలార్ అని టైటిల్ ఎంచుకోవడంలోనే ప్రభాస్ ఇమేజ్ ఇంకో పదింతలు పెరిగింది అని చెప్పొచ్చు. బాహుబలి తో పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెట్టిన ప్రభాస్.. ఆ సినిమాతో ఇండియా వైడ్ అభిమానులనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఫాన్స్ ని కూడగట్టుకున్నారు.
బాహుబలి తర్వాత ఆ రేంజ్ తగ్గకుండా వరసగా పాన్ ఇండియా ప్రాజెక్ట్ నే చేస్తున్న ప్రభాస్ సింపిల్సిటికి ఆయన ఫాన్స్ మాత్రమే కాదు, ప్రతి సినిమా లవర్ ఫిదా అవుతుంటారు. అందుకే ప్రభాస్ కి ఎలాంటి టాగ్ అక్కర్లేదు, ప్రభాస్ పేరే ఓ బ్రాండ్ అన్న మాదిరి ఆయన క్రేజ్ ప్రపంచం మొత్తం పాకిపోయింది. ప్రస్తుతం ప్రభాస్ మీద 1000 కోట్ల పెట్టుబడితో సినిమాలు తెరకెక్కుతున్నాయి. అందులో సలార్ పాన్ ఇండియా మూవీ కాగా, ఆదిపురుష్ ని హాలీవుడ్ లోను రిలీజ్ చేస్తూ పాన్ వరల్డ్ మూవీ చేసారు. అలాగే ప్రాజెక్ట్ కె కూడా ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ గానే రాబోతుంది. ఇవన్నీ వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమాలే. ప్రభాస్ తదుపరి సినిమాలు కూడా ఈ రేంజ్ కి తగ్గకుండానే ఉండబోతున్నాయి.
ఇలా ప్రభాస్ కి ఎంత క్రేజ్ ఉన్నప్పటికీ.. ఆయన మాత్రం సింపుల్ గా ఉండడానికే ఇష్టపడుతుంటారు. అదే ప్రభాస్ లో ప్రత్యేకత..