అమీరా ఖాన్ లాల్ సింగ్ చద్దా ఈ గురువారం విడుదలై డిసాస్టర్ టాక్ తెచ్చుకోవడమే కాదు, సోషల్ మీడియాలో సినిమాపై విపరీతంగా ట్రోలింగ్ జరుగుతుంది. లాల్ సింగ్ చద్దా విడుదలకు ముందు నుండే బాయ్ కాట్ లాల్ సింగ్ చద్దా హాష్ టాగ్ ని ట్రెండ్ చెయ్యడంతో సినిమాకి సరైన ఓపెనింగ్స్ రాలేదు. అమీర్ ఖాన్ కెరీర్ లో అత్యంత దారుణమైన ఓపెనింగ్స్ ఈ సినిమాకి దక్కాయి. సినిమా మొత్తం పరుగు, థియేటర్స్ నుండి ఆడియన్స్ రన్నింగ్ అంటూ ట్రోల్ చేస్తున్నారు. అయితే లాల్ సింగ్ చద్దా సోషల్ మీడియా ట్రోలింగ్ పై ఆ సినిమా హీరోయిన్ కరీనా కపూర్ గమ్మత్తుగా స్పందించారు. ఓ ఈవెంట్ లో లాల్ సింగ్ చద్దా కి సరైన ఓపెనింగ్స్ దక్కపోవడానికి కారణం ఏమిటి అని కరీనాని ప్రశ్నించారు మీడియా వారు.
దానికి కరీనా లాల్ సింగ్ చద్దాని కొంతమంది కావాలనే టార్గెట్ చేసారు. అలాంటి వారు మొత్తం ఆడియన్స్ లో ఒక్కశాతం మందే ఉంటారు. వాళ్ళే పనిగట్టుకుని సినిమాని ట్రోల్ చేస్తారు. మిగతా వారు సినిమాని ఆదరిస్తున్నారు. సినిమాని గనక బహిష్కరిస్తే.. ఓ మంచి సినిమాని మిస్ అయినవారవుతారు. రెండున్నరేళ్లుగా 250 మంది సినిమా కోసం కష్టపడ్డాం, ఆడియన్స్ మూడేళ్ళుగా సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేసారు. అలాంటి సినిమాపై నెగెటివిటి సృష్టించవద్దు అంటూ చెప్పుకొచ్చింది.