జూన్ 9 న పెళ్లి బంధంతో పెనవేసుకున్న అందమైన జంట నయనతార -విగ్నేష్ శివన్ లు.. పెళ్లి అవ్వగానే గుడులు, గోపురాలు అంటూ తిరగేసారు. తిరుపతి, కేరళ లోని అమ్మవారు టెంపుల్ అలాగే నయనతార తల్లిని మీట్ అయ్యి ఆ తర్వాత థాయిలాండ్ కి హనీమూన్ అంటూ చెక్కేశారు. హనీమూన్ లో ఎలా ఎంజాయ్ చేసారో ఫొటోస్ రూపంలో సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ జంట హనీమూన్ నుండి తిరిగిరావడమే నయనతార ముంబై వెళ్ళిపోయింది. అక్కడ షారుఖ్ ఖాన్ తో నటించే జవాన్ షూటింగ్ లో పాల్గొంది. ఇక విగ్నేష్ కూడా తదుపరి ప్రాజెక్ట్ పనుల్లో ఓ నెల రోజులు బిజీగా గడిపారు.
మరి నెలరోజుల పాటు గ్యాప్ లేకుండా షూటింగ్స్ తో అలిసిపోయిన ఈ జంట మరోసారి హనీమూన్ కి చెక్కేసింది. అందుకే షూటింగ్ లకి చిన్న బ్రేక్ అంటూ స్పెయిన్‌లో బార్సిలోనాలోకి ఎగిరిపోయారు. ఫ్లైట్ లో ప్రయాణం చేసేటప్పుడు ఈ కపుల్ ఎంత క్యూట్ గా రొమాంటిక్ గా ఎంజాయ్ చేసారో అనేది విగ్నేష్ ఇన్స్టాలో పోస్ట్ చేసిన పిక్ చూస్తే తెలిసిపోతుంది.. ఇక్కడ కూడా నయనతార తాళితో అందరిని ఆశ్చర్యపరిచింది. ఎంత హీరోయిన్ అయినా సంప్రదాయానికి నయన్ ఇచ్చే విలువకి నెటిజెన్స్ కూడా ఫిదా అవుతున్నారు. ఇదిలా ఉంటే నయనతార - విగ్నేష్ శివన్ ల పెళ్లి డాక్యుమెంటరీని నెట్ ఫ్లిక్స్ అతి త్వరలోనే ప్రసారం చెయ్యబోతున్నట్టుగా ప్రోమో వదిలింది.