పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ఇంటర్నేషనల్ రేంజ్ లో తెరకెక్కిస్తున్న ప్రోజెక్ట్ కే పై భారీ అంచనాలు రేకెత్తించేలా నాగ్ అశ్విన్ ప్లాన్ చేస్తున్నారు. అశ్విని దత్ ప్రొడ్యూసర్ గా భారీ బడ్జెట్ పెట్టి తీస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో అమితాబ్, బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే నటిస్తుంది. అలాగే మరో గ్లామర్ బ్యూటీ దిశా పటాని కూడా ఈ ప్రోజెక్ట్ లో భాగమైంది. అయితే ప్రాజెక్ట్ కే షూట్ ప్రస్తుతం ఆగింది. కారణం ప్రభాస్ మోకాలి సర్జరీ కోసం విదేశాలకు వెళ్లడంతో షూటింగ్ కి కొద్దిగా బ్రేక్ ఇచ్చారు. అయితే ప్రోజెక్ట్ కే అప్ డేట్స్ ని అశ్విని దత్ ఈ మధ్యన అప్పుడప్పుడు రివీల్ చేస్తున్నారు. సీతా రామం సినిమా ప్రమోషన్స్ లో అశ్విని దత్ ప్రోజెక్ట్ కే షూటింగ్ శరవేగంగా జరుగుతుంది అని, షూటింగ్ పూర్తయిన పది నెలలు ప్రోస్ట్ ప్రొడక్షన్ పనులకి కేటాయించి అప్పుడు సినిమాని రిలీజ్ చేస్తామని చెప్పారు.
అయితే 2023 అక్టోబర్ కానీ.. లేదంటే 2024 ప్రథమార్ధంలో కానీ ప్రోజెక్ట్ కే రిలీజ్ ఉంటుంది అని చెప్పారు. తాజాగా ఆలీ తో జాలిగా ప్రోగ్రాం కి గెస్ట్ గా వచ్చిన ఆయన ప్రోజెక్ట్ కే షూటింగ్ ఇప్పటికే 55 శాతం చిత్రీకరణ పూర్తైందని చెప్పారు. ఇటీవల మరో షెడ్యూల్ కూడా ప్లాన్ చేశాము. కానీ అది ఇంకా కుదరలేదు అది కూడా అయి ఉంటే ఇంకా టాకీపార్ట్ ఎక్కువ శాతమే పూర్తయ్యేది అంటూ చెప్పడంతో ప్రభాస్ ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు. త్వరగా షూటింగ్ కంప్లీట్ అయితేవచ్చే ఏడాది చివరిలో ప్రోజెక్ట్ కే ప్రేక్షకుల ముందుకు వస్తుంది అని వారి ఆశ.