Advertisement
Google Ads BL

ఇంట్రెస్టింగ్: నిద్ర లే దిల్ రాజు


ఈమధ్యన ఫాన్స్ కి కోపం వచ్చినా, లేదంటే నిర్మాతలు అప్ డేట్స్ ఇవ్వకపోయినా.. వారిని సోషల్ మీడియాలో రకరకాల పేర్లు తో హాష్ టాగ్స్ తగిలించి మరీ ట్రెండ్ చేస్తున్నారు. గతంలో ప్రభాస్ సినిమా అప్ డేట్స్ కోసం యువీ క్రియేషన్స్ వారిని ప్రభాస్ ఫాన్స్ #WakeUpUVCreations అనే హాష్ టాగ్ ట్రెండ్ చేస్తూ నిర్మాతలను పరుగులు పెట్టించారు. తర్వాత కూడా మైత్రి వారిని ఇలా చాలామంది నిర్మాతలను ఫాన్స్ సోషల్ మీడియాలో అల్లరి చేస్తూనే ఉన్నారు. తాజాగా ఈ సెగ దిల్ రాజుకి తగిలింది. నిద్ర లే దిల్ రాజు అంటూ మెగా ఫాన్స్ రచ్చ స్టార్ట్ చేసారు. 

Advertisement
CJ Advs

రామ్ చరణ్-శంకర్ కలయికలో తెరకెక్కుతున్న RC15 అప్ డేట్ ఇవ్వాలంటూ దిల్ రాజు ని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. అది పాజిటివ్ గా కాదు, #WAKEUPDILRAJU హాష్ టాగ్ తో చరణ్ ఫాన్స్ దిల్ రాజుకి చుక్కలు చూపిస్తున్నారు. ట్రిపుల్ ఆర్ లో ఎన్టీఆర్ ని కట్టేసి రామ్ చరణ్ కొడుతున్న వీడియో ని షేర్ చేస్తూ.. Update iche varuku ilage vintha vintha tags tho niku ramp aadistham  @SVC_official, WAKE UP DILRAJU, WE WANT RC15 UPDATE అంటూ మెగా ఫాన్స్ చేసే హంగామా నెటిజెన్స్ కి నవ్వు తెప్పిస్తుంది. ఆగష్టు 15 న RC15 లుక్ తో పాటుగా టైటిల్ కూడా రివీల్ చేస్తారనే ఆశతో మెగా ఫాన్స్ ఉండగా.. ఇంతవరకు ఆ సినిమాకి సంబందించిన కబురు అందకపోయేసరికి.. మెగా ఫాన్స్ కి మండి నిర్మాత దిల్ రాజుని ఏసుకుంటున్నారు.

WAKEUPDILRAJU hashtag trends on Twitter:

Mega Fans troll Dil Raju about update on RC15
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs