గత వారం విడుదలైన బింబిసార, సీత రామం సినిమాలు వారం రోజులుగా థియేటర్స్ లో హంగామా చేస్తున్నాయి. సినిమాల విషయంలో నిరాశలో ఉన్న ప్రేక్షకులు నిద్ర లేచి థియేటర్స్ వైపు కదిలేలా ఈ రెండు సినిమాలు చేసాయి. థియేటర్స్ లో మూవీ చూస్తే కిక్ వస్తుంది అనేలా రెండు సినిమాలు ఉండడంతో.. ఆ సినిమాల కలెక్షన్స్ కూడా కళకళలాడాయి. బింబిసార మూడు రోజులకే లాభాల బాట పట్టగా.. సీత రామం ఐదు రోజులకి లాభాల వేటలో పడింది. గత వారం రోజులుగా సోషల్ మీడియాలో బింబిసార, సీతారామం కలెక్షన్స్ తో హడావిడి కనిపించింది. మరి ఇప్పుడు ఈ కలెక్షన్స్ కి కళ్లెం వెయ్యడానికి నితిన్ - నిఖిల్ ఇద్దరూ పోటీ పడుతున్నారు.
నితిన్ నటించిన మాస్ మూవీ మాచర్ల నియోజక వర్గం నేడు ఆడియన్స్ ముందుకు వచ్చింది. భారీ ప్రమోషన్స్ తో, అంజలి ఐటెం సాంగ్ తో సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. ఈ సినిమాకి హిట్ టాక్ పడితే బింబిసార, సీత రామం కలెక్షన్స్ డల్ అవుతాయి. మరోపక్క కార్తికేయ 2 తో రేపు శనివారం నిఖిల్ వరల్డ్ వైడ్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కార్తికేయ 2 ప్రమోషన్స్ ని డిఫరెంట్ గా నిర్వహించింది టీం. మరి కార్తికేయ 2 కి కొద్దిగా పాజిటివ్ టాక్ వచ్చినా చాలు నిఖిల్ సేఫ్ అయ్యేలా ఉంది ప్రస్తుతం థియేటర్స్ పరిస్థితి. సో నితిన్, నిఖిల్ లు తమ తమ సినిమాలతో బింబిసార, సీత రామం కలెక్షన్స్ అడ్డుకుంటారేమో అనేది కొద్ది గంటల్లో తేలిపోతుంది.