Advertisement
Google Ads BL

కోరిక తీర్చితేనే ఛాన్సిస్తా అన్నాడా డైరెక్టర్


ఓ దర్శకుడు తనని గదిలోకి పిలిచి.. కోరిక తీరిస్తే అవకాశం ఇస్తానన్నాడని తెలిపింది ఐటమ్ బ్యూటీ అప్సరా రాణి. ఈ భామ పేరు వినగానే కచ్చితంగా ఆ దర్శకుడు రామ్ గోపాల్ వర్మే అయి ఉంటాడని అంతా అనుకుంటారు. కానీ ఆమె చెబుతున్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కాదు. ఓ కన్నడ దర్శకుడని ఆమెనే స్వయంగా తెలిసింది. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమెను.. ఇండస్ట్రీలో ఎదురైన చేదు అనుభవం గురించి చెప్పమని అడుగగా.. ఈ విధంగా స్పందించింది. ‘‘అవకాశాల కోసం చూస్తున్న రోజుల్లో.. ఓ కన్నడ దర్శకుడి నుంచి కాల్ వచ్చింది. తను చేయబోతున్న సినిమాలో అవకాశం ఉంది.. వచ్చి కలవమన్నాడు. చాలా సంతోషంతో వెళ్లాను. కానీ అక్కడికి వెళ్లిన తర్వాత ఒక గదిలోకి పిలిచి.. నా కోరిక తీరుస్తావా? నీకు అవకాశం ఇస్తానని అన్నాడు. నేను భయపడిపోయాను. వెంటనే అక్కడి నుంచి పారిపోయాను..’’ అని అప్సరా రాణి తెలిపింది. 

Advertisement
CJ Advs

 

ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ కంటిలో పడటం.. ఆయన ‘థ్రిల్లర్’ అంటూ ఈ బ్యూటీని జనంపై వదలడంతో.. ఆమె కెరీర్ ఒక్కసారిగా టర్నయింది. అంకిత మహారాణా పేరుని ‘అప్సరా రాణి’గా మార్చుకున్న ఈ బ్యూటీ.. ‘క్రాక్’తో భూమ్ బద్దలు కొట్టింది. పెప్సీ ఆంటీగా కుర్రాళ్లతో ‘సీటీమార్’ స్టెప్పులేయించింది. మొత్తంగా ఐటమ్‌కి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన ఈ బ్యూటీ.. సోషల్ మీడియాలోనూ నెటిజన్లను అందాలతో అల్లాడిస్తుంది. అయితే వర్మతో మందు కొడుతూ.. కిస్‌లు పెట్టించుకుంటూ.. నిత్యం కుర్రాళ్లను కవ్వించే ఈ బ్యూటీ నోటి నుండి.. పారిపోయాను.. పరిగెత్తాను అనే మాటలే ఇప్పుడందరికీ ఆసక్తిని కలిగిస్తున్నాయి. అన్నట్లు ఈ ఇంటర్వ్యూలో ఈ భామ వర్మని ఓ మోతాదులో మోసేయడం గమనార్హం.

ఇది కూడా చదవండి: నా డేటింగ్ గురించి నేనే చెప్తా- రష్మిక

Item Specialist Apsara Rani Sensational Comments :

Apsara Rani Shares Her Casting Couch Incident
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs