Advertisement
Google Ads BL

మరోసారి రిజెక్ట్ చేసిన అల్లు అర్జున్


అల్లు అర్జున్ పాన్ ఇండియా మార్కెట్ లో పుష్ప రాజ్ గా ఓ బెంచ్ మార్క్ ని సెట్ చేసి.. పుష్ప ద రూల్ పై అంచనాలు పెరిగేలా చేసారు. ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ తో కలిసి పుష్ప ద రూల్ ని మొదలు పెట్టేందుకు రెడీ అవుతున్నారు. ఇంతలోపులో అల్లు అర్జున్ తన ఇమేజ్ కి తన క్రేజ్ కి వస్తున్న పలు ప్రోడక్ట్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా యాడ్ షూట్ లు చేసేస్తున్నారు. హరీష్ శంకర్, త్రివిక్రమ్, సుకుమార్ లతో అల్లు అర్జున్ మూడు రకాల ప్రోడక్ట్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా చేసిన అల్లు అర్జున్ వెంట మరో ప్రోడక్ట్ యాజమాన్యం పడుతుంది. ఇప్పటికే అల్లు అర్జున్ తో గుట్కా కంపెనీ ఒప్పందం పెట్టుకోవాలనుకుంటే అప్పట్లో అల్లు అర్జున్ దానిని రిజెక్ట్ చేసారు.

Advertisement
CJ Advs

ఇక ఇప్పుడు ప్రతి యాడ్ కి 7 నుండి 7.5 కోట్లు తీసుకునే అల్లు అర్జున్ కి సదరు గుట్కా అండ్‌ లిక్కర్‌ కంపెనీ అల్లు అర్జున్ కి ఏకంగా 10 కోట్ల పారితోషకం ఆశ చూపినా అల్లు అర్జున్ మాత్రం మరోసారి గుట్కా అండ్‌ లిక్కర్‌ యాడ్ ని రిజెక్ట్ చేశారట. ఆ ప్రోడక్ట్ వలన జనాలు నష్టపోతారు.. హానికరమని అల్లు అర్జున్ దానికి నో చెప్పారట. అల్లు అర్జున్ గుట్కా అండ్‌ లిక్కర్‌ యాడ్ కి నో చెప్పడంతో ఆయన ఫాన్స్ మా హీరో చూసారా.. ఎంత మంచివాడో.. ఆ ప్రోడక్ట్ వలన జనాలకు హానికలగకూడదని ఆంత పారితోషకం వద్దన్నాడు అంటూ చంకలు గుద్దేసుకుంటున్నారు. 

Allu Arjun Rejected Gutkha Advertisement:

Allu Arjun turns down tobacco commercial
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs